నాని కొత్త మూవీకి ముంబై మోడల్

April 24, 2015 | 03:53 PM | 61 Views
ప్రింట్ కామెంట్
mehr_pirzada_nani_niharonline

ఈ మధ్య టాలీవుడ్ కు హిందీ సీరియల్స్ నుంచి వలస వస్తున్నారనే సంగతి తెలిసిందే. అదే బాటలో ఇక్కడికి వచ్చి ఇప్పటికే కొందరు పాగా వేశారు. ఇఫ్పుడు మరో మోడల్ అడుగుపెట్టనుంది. ప్రముఖ 14రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాని హీరోగా త్వరలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ముంబై మోడల్ మెహర్ ఫిర్జదా ఎంపికయినట్లు సమాచారం. మెహర్ ఇప్పటికే చాలా యాడ్స్ లో నటించింది. ఆ అనుభవంతోనే ఈ అమ్మడికి ఇప్పుడు టాలెంట్ ఉన్న నాని సరసన ఆఫర్ వచ్చేలా చేసిందట. ప్రస్తుతం నాని మారుతి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తవ్వగానే 14 రీల్స్ చిత్రం షూటింగ్ ప్రారంభమౌతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ