‘కేటుగాడు’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

April 27, 2015 | 11:14 AM | 82 Views
ప్రింట్ కామెంట్
ketugadu_telugu_movie_chandini_chowdary_niharonline

‘ఉలవచారు బిర్యాని’ ఫేం తేజస్‌ టైటిల్‌ పాత్రలో.. పలు షార్ట్‌ ఫిలింస్‌ ద్వారా సుపరిచితురాలైన బ్యూటీ చాందిని హీరోయిన్‌గా.. యువ ప్రతిభాశాలి ‘కిట్టు నల్లూరి’ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం ‘కేటుగాడు’. ‘100 క్రోర్స్‌ అకాడమి’తో కలిసి వెంకటేష్‌ మూవీస్‌ పతాకంపై యువ వ్యాపారవేత్త వెంకటేష్‌ బలసాని తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత వి.యస్‌.పి.తెన్నేటి సమర్పిస్తున్నారు. షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ జరుపుకొంటున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసారు. ప్రముఖ నిర్మాత కె.యస్‌.రామారావు ‘వెంకటేష్‌ మూవీస్‌’ బ్యానర్‌ లోగోను ఆవిష్కరించగా.. హీరో ఫాదర్‌ బాలభాను ‘కేటుగాడు’ మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసారు. ఫస్ట్‌ లుక్‌ను రాజీవ్‌ కనకాల విడుదల చేసారు. తాను నిర్మించిన ‘ఉలవచారు బిర్యాని’ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన తేజస్‌ నటిస్తున్న ‘కేటుగాడు’ ఘన విజయం సాధించాలని కె.యస్‌.రామారావు ఆకాక్షించారు. ఈ చిత్రం ద్వారా నిర్మాతగా పరిచయమవుతున్న వెంకటేష్‌ బలసానిలో అగ్ర నిర్మాతగా రాణించేందుకు అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నాయని రాజీవ్‌ కనకాల అన్నారు. ‘కేటుగాడు’ సినిమాకి పనిచేయడం తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని హీరోహీరోయిన్లు తేజస్‌`చాందిని పేర్కొన్నారు. చిత్ర సమర్పకులు వి.యస్‌.పి.తెన్నేటి, చిత్ర ఛాయాగ్రాహకుడు మల్‌హర్‌భట్‌జోషి ‘కేటుగాడు’ సినిమా అన్ని వర్గాల వారు మెచ్చేలా రూపొందిందన్నారు. యూనిట్‌ మెంబర్స్‌ అందరూ పూర్తి స్థాయిలో సహాయసహకారాలు అందజేసారని చెప్పిన నిర్మాత వెంకటేష్‌ బలసాని.. యూనిట్‌ మెంబర్స్‌ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముందు అనుకున్నదాని కంటే బడ్జెట్‌ కొంచెం ఎక్కువ అయినప్పటికీ.. నిర్మాత వెంకటేష్‌ ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్‌తోనే ‘కేటుగాడు’ చిత్రం అన్ని వర్గాల వారితో కేక పెట్టించేలా రూపుదిద్దుకుందని దర్శకుడు కిట్టు నల్లూరి అన్నారు. శ్రేయాస్‌తో కలిసి ఈ3 మీడియా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంయుక్త వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

సుమన్‌, రాజీవ్‌ కనకాల, అజయ్‌, సప్తగిరి, స్నిగ్ధ, భావన, పృధిó్వ, ప్రవీణ్‌, చంద్రశేఖర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, అదుర్స్‌ రఘు, సత్య తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: అచ్చిబాబు.యం`సంపత్‌కుమార్‌.ఎ, మాటలు: పి.రాజశేఖర్‌రెడ్డి`భాషాశ్రీ, పాటలు: శ్రీమణి`కాసర్ల శ్యామ్‌`భాషాశ్రీ`బాలాజీ`బి.సుబ్బరాయశర్మ, సంగీతం: సాయికార్తీక్‌, ఎడిటర్‌: పి.వెంకటేశ్వర్రావు, ఫైట్‌ మాస్టర్‌: నందు, సమర్పణ: వి.యస్‌.పి.తెన్నేటి, నిర్మాత: వెంకటేష్‌ బలసాని, కథ`చిత్రానువాదం`దర్శకత్వం: కిట్టూ నల్లూరి.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ