మన హీరోలు ఏం చదువుకున్నారు?

September 24, 2015 | 01:52 PM | 1 Views
ప్రింట్ కామెంట్
telugu_heroes_qualification_niharonline

ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న.... వచ్చిన వారంతా అనుకోకుండా ఫీల్డ్ లోకి ఎంటరైన వారు మాత్రం కాదు. ఫామిలీ పరంగా ఎంచుకున్న మార్గం కొందరిదైతే... కొందరు హీరోలు కావాలనే బలమైన కోరికతో వస్తున్న వారున్నారు. మరి వీరి దృష్టంతా మొదటి నుంచి సినిమాపైనే ఉంటుంది కాబట్టి చదువులు అంతగా సాగినట్టు కనిపించడం లేదు. నాని, రానా లాంటి వారు యాక్టర్ అవుదామనే పాషన్ తో కాకపోయినా ఇండస్ట్రీలో ఏదో ఒక ఫీల్డ్ ను ఎంచుకుందామనే కోరికతో వచ్చి... నటులుగా రాణిస్తున్నారు. ఎంత నటులైనా స్కూలుకు, కాలేజీలకు వెళ్ళాల్సిందేగా... మరి మన హీరోలు ఏం చదివారో తెలుసుకుందామా....
 

పవన్ కళ్యాణ్: ఇంటర్, డిప్లమో ఇన్ కంప్యూటర్స్ , కరాటే స్టంట్ మాస్టర్.

మహేష్ బాబు: చెన్నై లోని లయోలా కాలేజీలో బి.కాం పూర్తి చేశారు.
ప్రభాస్: భీమవరంలోని డిఎన్ఆర్ స్కూల్ లో టెంత్ పూర్తి చేశారు. హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదివాడు. బిటెక్ పూర్తి చేశాడు. 
దగ్గుబాటి రానా: స్కూలింగ్ హైదరాబాద్ లోని వెంగళ్ రావు నగర్ లో టెంత్ పూర్తి చేశారు. కొనికా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇమేజింగ్ అండ్ టెక్నాలజీలో ఫొటోగ్రఫీ నేర్చుకున్నారు. సినిమాటో గ్రాఫర్ కావాలనే కోరికతో వాటికి సంబంధించిన వాటిపై ఎక్కువ దృష్టి పెట్టారు.
ఎన్టీఆర్: స్కూలింగ్ విజ్ఞాన్ విద్యాలయం, హైదరాబాద్. గుంటూరు విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్. సెంట్ మెరీస్ కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేశాడు.
అల్లు అర్జున్: ఎంఎస్ ఆర్ కాలేజీలో బిబిఎ డిగ్రీ, స్కూలింగ్ సెంట్ పాట్రిక్ స్కూల్, చెన్నై.
రామ్ చరణ్ తేజ్: చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్ లో చదివాడు. ఇంటర్ ఊటీలో చదివాడు. మార్షల్ ఆర్ట్స్, హార్స్ రైసింగ్ లో పర్ఫెక్షనిస్ట్
నితిన్: బిటెక్ పూర్తి చేయలేదు.
పోతినేని రామ్: విజయవాడ సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ టెంత్ పూర్తి చేశాడు. చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమం హయ్యర్ స్టడీస్ పూర్తి చేశాడు. 

నాని: హైదరాబాద్ సెంట్ ఆల్ఫన్సాలో స్కూలింగ్ పూర్తి చేశారు. నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్, వెస్లీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
నాగచైతన్య: స్కూలింగ్ చెన్నైలోని పిఎస్ బిబి స్కూల్, కాలేజీ చదువులు హైదరాబాద్ లో ఆ తరువాత ముంబయిలోని యాక్టింగ్ స్కూల్లో చేరాడు. కాలిఫోర్నియాలో హాలీవుడ్ స్టూడియోలో జాయిన్ అయి అక్కడ డాన్స్ ఫైట్స్ నేర్చుకున్నాడు. మోటార్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ అవకాశం దొరికనప్పుడల్లా పాల్గొంటుంటాడు.
సందీప్ కిషన్: సినిమాటో గ్రాఫర్ చోటా కే నాయుడుకు అల్లుడి వరుస. ఈయన చెన్నై లయోలాలో గ్రాడ్యుయేషన్ చేశాడు.
నిఖిల్: హైదరాబాద్ బేగంపేట్ పబ్లిక్ స్కూల్ స్కూలింగ్ పూర్తి చేశాడు. మఫ్కామ్ జా కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో బి.టెక్ పూర్తి చేశాడు. 
వరుణ్ సందేశ్: స్కూలింగ్ యూఎస్ లో పూర్తి చేశాడు.
రాజ్ తరుణ్: ఇంజినీరింగ్, వైజాగ్.
నాగశౌర్య: హైదరాబాద్ సెంట్ మెరిస్ కాలేజీలో బి.కాం కంప్యూటర్స్ చేశాడు. యాక్టర్ కాక ముందు టెన్నిస్ ప్లేయర్. 
సాయి ధరమ్ తేజ్: హైదరాబాద్ నలంద స్కూల్లో టెంత్ పూర్తి చేశాడు. ఐఐపిఎంలో ఎంబిఎ (బయోటెక్నాలజీ) చేశారు. 

యాక్టింగ్ లో ఇరగదీసే మన హీరోల చదువులు చూస్తే... సినిమా మీద కాన్సన్ ట్రేషన్ చదువులకు స్వస్తి పలికినట్టుగా అనిపిస్తోంది. 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ