శంకర్ ఎఫెక్ట్: బాబోయ్... తెలుగులో ఇంత క్రేజా?

January 14, 2015 | 12:46 PM | 31 Views
ప్రింట్ కామెంట్

శంకర్ విక్రమ్ హీరోగా సృష్టించిన విజువల్ వండర్ ‘ఐ’. తెలుగులో ఐ (మనోహరుడు) పేరిట రిలీజైంది. నిజానికి ఇది ఒక తమిళ డబ్ సినిమా, అయినప్పటికీ తెలుగులో అగ్రహీరోల సినిమాల మాదిరిగా విడుదలై ఆశ్చర్యపరుస్తుంది. తాజా రిపోర్టు ప్రకారం తెలుగు చిత్రాలకు కూడా సాధ్యంకానీ రీతిలో వారంపాటు చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్ల అడ్వాన్స్ బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయట. ఇంకా ఆశ్చర్యకర విషయమేంటంటే... తమిళంలో కంటే వేగంగా తెలుగులో టికెట్లు బుక్ కావటం. విడుదలకు ముందుకూడా సినిమా తెలుగు శాటిరైట్స్ హక్కులు రూ.40 కోట్లకు అమ్ముడు పోయి రికార్డు స్రుష్టించింది. ‘ఇండియన్ స్పీల్ బర్గ్’ శంకర్ విజువల్ వండర్ కదా కనీసం ఒక్కసారైనా చూడాలనుకోవటం, పైగా సెలవులు కలిసి రావటంతో ఈ పరిస్థితికి కారణమని తెలుగు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు ఒక డబ్ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ థియేటర్ల లో విడుదల కావడం కూడా ఇదే తొలిసారి అట. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం కూడా ఈ ఫీట్ ను సాధించలేకపోయింది. మరోవైపు దేశ విదేశాల్లో ఈ సినిమా దాదాపు 3 వేల థియేటర్లలో రిలీజవుతున్నట్లు సమాచారం ఉండగా, ఒక్క అమెరికాలో మాత్రమే 450 థియేటర్లలో ‘ఐ’ విడుదలవుతుండం విశేషం. మరోవైపు హిందీలోనూ ‘ఐ’ సినిమాను బాగా ప్రమోట్ చేయడంతో అక్కడ కూడా బుకింగ్స్ రెండు రోజుల వరకు అయిపోయాయట. చిత్రం గనుక హిట్ టాక్ తెచ్చుకున్నట్లయితే ప్రస్తుతం ఆడుతున్న సినిమాలకే కాదు రాబోయే సినిమాలకు కూడా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది. శంకర్ ఎఫెక్ట్ ఏంటో ఈ చిత్రంతో తెలిసిపోతుంది కదా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ