పటాస్... టెంపర్ ఆడియో ఫంక్షన్లలో... 2015 నందమూరి నామ సంవత్సరం అవుతుందని జూ.ఎన్టీఆర్ అన్నట్టుగానే పటాస్... టెంపర్ రిజల్ట్స్ అనూహ్య రీతిలో బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇక బాలయ్య లయనే మిగిలింది. సినీ చరిత్రలో 2015 నందమూరి నామ సంవత్సరం అవుతుందన్న ఎన్టీఆర్ వాక్కు నిజమవుతుందనే చర్చ సర్వత్రా వినిపిస్తోంది ఆ మధ్య ‘పటాస్' సక్సెస్ మీట్ లో జూ ఎన్టీఆర్ మాట్లాడుతూ అన్నయ్య ‘పటాస్' తో మొదలు పెట్టాడు ‘టెంపర్'తో అది కంటిన్యూ అవుతూ బాబాయ్ ‘లయన్' హిట్టయ్యే వరకు కొనసాగుతుంది అన్నారు. ఆంధ్రా వాలా ఫ్లాప్ ను తిరిగి ఈ ఇద్దరి కాంబినేషనల్ వచ్చిన ‘టెంపర్' చెరిపేసింది. చాలా కాలం తర్వాత జూ ఎన్టీఆర్ కు వచ్చిన పెద్ద హిట్ ఇది. దీంతో నందమూరి అభిమానులకు పట్టపగ్గాలు లేవు. ఏ థియేటర్లో చేసినా ఆనందోత్సాహాలు, కేరింతలు, ఈలలు. ఈ చిత్రం ట్రైలర్ నుంచే ఆడియన్స్ లో భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక రాంగోపాల్ వర్మ కామెంట్లతో ఒక సస్పెన్స్ క్రియేట్ అయినప్పటికీ, ఊరికే అంతలా కామెంట్ చేయరు కదా. నిజంగానే ఆ రేంజ్ లోనే ఉంది జూనియర్ ఎన్టీఆర్ నటన అంటున్నారు ప్రేక్షకులు. మహేష్ బాబు పోకిరీ సినిమాలో వన్ మాన్ షోలాగా. ఈ చిత్రంలో కూడా ఎన్టీఆర్ మాత్రమే కనిపిస్తాడు.అయితే ముందే అనుకున్నట్టుగా అభిమానులు ఎన్టీఆర్ హిట్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టే రిలీజ్ రోజున వారిని కంట్రోల్ చేయడం అంతే కష్టమయ్యిందట. అన్ని థియేటర్ల దగ్గర. తిరుపతిలోని జయశ్యాం థియేటర్ వద్ద గురువారం ఉదయం జూ ఎన్టీఆర్ అభిమానులు దాడి చేశారు. టెంపర్ సినిమా ఆలస్యంగా ప్రదర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, థియేటర్ అద్దాలు ధ్వంసం చేశారు. టెంపర్ చిత్రాన్ని అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యం నిరాకరించడంతో దాడి చేసారు. దీనికోసం థియేటర్ వాళ్ళు పోలీసులను ఆశ్రయించక తప్పలేదు.