జగదాంబ ప్రొడక్షన్స్ ఫిలింస్ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్వకత్వంలో ఎర్రోజు వెంకటాచారి నిర్మిస్తున్న చిత్రం ‘ది బెల్స్’. రేయాన్ రాహుల్, నేహా దేశ్‌పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్ర ఆడియో ఇటీవల విడుదలై శ్రోతలను అలరిస్తోంది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి మే మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎర్రోజు వెంకటాచారి మాట్లాడుతూ... ‘‘పాటల రచయిత కాసర్ల శ్యామ్ సంగీతంలో రూపొందిన మా చిత్ర ఆడియో ఇటీవల విడుదల చేశాము. విన్నవారందరూ పాటలు బావున్నాయంటున్నారు. సోషల్ మీడియాలో పాటలకు మంచి రేటింగ్స్ లభించాయి. ఆడియో సక్సెస్ కావడంతో సినిమాపై ఎంతో నమ్మకం ఏర్పడిరది. ట్రైలర్స్‌కు కూడా మంచి కాంప్లిమెంట్స్ లభిస్తున్నాయి. ఫస్ట్ కాపీ సిద్ధంగా ఉంది. త్వరలో సెన్సార్ పూరి ్తచేసి సినిమాను మే మొదటి వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. చక్కని సందేశంతో పాటు యూత్‌కు కావాల్సి అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని నిర్మించాము. కుటుంబం మొత్తం కలిసి చూసేలా సినిమా చాలా క్లీన్‌గా ఉంటుందని’ అన్నారు. దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ...‘‘సమకాలీన అంశాలను తీసుకొని వినోదంతో పాటు చక్కటి సందేశాన్ని అందిస్తూ రూపొందించిన చిత్రం ‘ది బెల్స్’. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన చిత్రం. అన్ని వయసుల వారికి నచ్చేలా ఉంటుంది. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమా క్వాలిటీగా రావడానికి సహకరించారు. తెలంగాణ ప్రభుత్వం భారీ నీటి పారుదల శాఖా సలహాదారు శ్రీ విద్యాసాగర్ రావు గారు, ప్రముఖ గాయని కుమారి మధుప్రియ ప్రత్యేక పాత్రలలో నటించారు. కథ, కథనాలతో పాటు కెమెరా వర్క్, మ్యూజిక్ సినిమాకు హైలెట్‌గా నిలిచే అంశాలని’ తెలిపారు. రేయాన్ రాహుల్, నేహ దేశ్‌పాండే, సూర్య, వైజాగ్ ప్రసాద్, శివారెడ్డి, చలపతి, జబర్‌దస్త్ అప్పారావు ,జబర్‌దస్త్ మూర్తి, సాధురామకృష్ణ, మిధున్ సామిరెడ్డి, నిట్టల, గౌతమి, వైజాగ్ ప్రసాద్, గాయని మధుప్రియ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఉదయ్, సంగీతం: కాసర్లశ్యామ్, పాటలు: వరికుప్పల యాదగిరి, గోరేటి వెంకన్న, కాసర్లశ్యామ్, కూనాడి వాసుదేవరెడ్డి, రచన`మాటలు:శేఖర్ విఖ్యాత్, నిర్మాత:ఎర్రోజు వెంకటాచారి, కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్.