‘ది ఎండ్’కు మంచి గిరాకీ

February 20, 2015 | 04:49 PM | 47 Views
ప్రింట్ కామెంట్
the_End_movie_niharonline

కొత్త కథల కోసం వెతుకుతున్న సినీ పరిశ్రమలో ఓ సినిమా హిట్ అయ్యిందంటే, ఆ సినిమా హక్కులను కొనడానికి ఎగబడుతున్నాయి నిర్మాణ సంస్థలు. దాన్ని మళ్ళీ రీమేక్ కోసం, డబ్బింగ్ కోసం వ్యాపారం చేయడం ఇప్పుడు బాగా నడుస్తున్న ట్రెండ్. పోయిన సంవత్సరం తెలుగులో విడుదలైన చిన్న బడ్జెట్ సినిమా ‘ది ఎండ్’ . ఇది హరర్ మూవీ కూడా కావడం వల్ల బాక్సాఫీస్ వద్ద సక్సెస్ చిత్రంగా నిలిచింది. ఇందులో నటించిన వారంతా కొత్త వాళ్ళే. 2014లో విడుదలైన చిత్రాల్లో ఇది కూడా సక్సెస్ లిస్టులో చేరిపోయింది. ఈ సైకలాజికల్ సస్సెన్స్ థ్రిల్లర్ ను ఇతర భాషల్లోకి రీ మేక్ చేయడానికి నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ చిత్రం తమిళ్, కన్నడ రీ మేక్ రైట్స్ ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హిందీ, మళయాళం రైట్స్ ను మాత్రం ఓ పెద్ద నిర్మాణ సంస్థ సొంతం చేసుకోడానికి ఈ చిత్రం నిర్మాతలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ