మెగా వర్సెస్ మంచు... థియేటర్ల కోసం కొట్టుకుంటున్నారు

September 01, 2015 | 11:27 AM | 3 Views
ప్రింట్ కామెంట్
theatres-clash-between-balebale-magadivoy-dynamite-nihar0nline.jpg

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య మంచి వాతావరణం నెలకొంది. బాహుబలి, శ్రీమంతుడు రెండు పెద్ద చిత్రాలే అయినప్పటికీ వాటి వాటి బడ్జెట్ ఆధారంగా దేనికీ నష్టం కలగకూడదన్న ఆయా నిర్మాతల ఆలోచన, చిత్ర పెద్దల జోక్యం మొత్తం మీద తెలుగు సినీ పరిశ్రమలో ఫ్రెండ్లీ వాతావరణం సృష్టించాయి. పెద్ద చిత్రాలతోపాటు చిన్న చిత్రాలు కూడా ఇకపై అదే సూత్రాన్ని కంటిన్యూ అయి లాభాల బాట పండిచుకోవచ్చునని అంతా డిసైడ్ అయ్యారు కూడా. అయితే రానున్న రెండు మూడు రోజుల్లో  ఆ పరిస్థితి మారబోతుందా? దీనికి కారణం లేకపోలేదు. ఈ నెల 4 న విడుదలయ్యే రెండు చిత్రాల మధ్య థియేటర్ల పోటీయే దీనికి కారణం. ఒకటి అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ 2, యువీ క్రియేషన్స్ తో సంయుక్తంగా నిర్మిస్తున్న భలే భలే మగాడివోయ్,  విష్ణు హీరోగా సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ లో దేవకట్టా దర్శకుడిగా తెరకెక్కించిన డైనమెట్ చిత్రం.

                                     సాధారణంగానే మెగా ఫ్యామిలీకి, మంచు వారికి పడదనే విషయం అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా అల్లు అరవింద్ అంటే మంచు వారికి ప్రత్యేకమైన పగ. ఇప్పుడీ రెండు చిత్రాలు థియేటర్ల్ కోసం పోటీపడుతూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. భలే భలే చిత్రాన్ని నైజాం లో దిల్ రాజు విడుదల చేస్తున్నాడు. దీంతో ఆటోమేటిక్ గా డైనమెట్ కి థియేటర్లు దొరకడం కష్టం. అయితే విష్ణు తన చిత్రాన్ని ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అవుతూ వస్తూ మంచి డేట్ కోసం ఎదురుచూస్తు వస్తున్నాడు. చివరికి అన్నీ కుదరడంతో ఈ నెల 4 నే విడుదల చెయ్యాలనుకుంటున్నాడు. మరి అతనికి నైజాంలో థియేటర్లు దొరుకుతాయా? స్వతహాగా బడా నిర్మాత కావటంతో ఒక్క నైజాంలోనే కాదు.. టోటల్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో థియేటర్లను రాబట్టడం పెద్ద విషయమేమీ కాదు. అదే సమయంలో విష్ణు పరిస్థితి ఏంటీ? నిర్మాతగా చిన్న చిన్న సక్సెస్ లు కొట్టినప్పటికీ , బిజినెస్ పరంగా పెద్దగా అనుభవం లేకపోవటంతో థియేటర్లు రాబట్టడం చాలా కష్టం. ముందు తక్కువ థియేటర్లో రిలీజ్ అయితే మాత్రం... ఖచ్ఛితంగా హిట్ టాక్ రావాల్సిందే. అలా వస్తే ఆ తర్వాతైనా థియేటర్లు పెరుగుతాయి. తమిళ హిట్ చిత్రం అరిమనంబీ కి రీమేక్ కావటం, పైగా దర్శకుడు దేవాకట్టా చిత్రం కావటంతో విష్ణు ఆ నమ్మకంతో ఉన్నాడట. ఏదేమైనా అన్ని కుదురుగా ఉన్న సమయంలో ఇద్దరిలో ఎవరో ఒకరు వివాదం రాజేసి వాతావరణాన్ని చెడగొట్టకుంటే చాలు...     

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ