ఈ ఏడాది బ్రహ్మీ మంత్రం అస్సలు పనిచేయలేదు. పైగా ఆయన చేసిన క్యారెక్టర్లన్నీ తుస్సుమన్నాయి కూడా. అదే సమయంలో బ్రహ్మనందంకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చే నటుడు దిగిపోయాడు. అతనే థర్టీ ఇయర్స్ పృథ్వీ. లేటు వయసులో క్లిక్ అయినప్పటికీ సినిమాలో కీలకమైన పాత్రలు పడటంతో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. లౌక్యం, బెంగాల్ టైగర్ చిత్రాలు అతని క్రేజ్ ఎంతగా పెంచాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోటీన్ ఫ్లేవర్ తో వచ్చిన ఆ చిత్రాలకు కెప్టెన్ ఆఫ్ ది షిప్ లాగా తన ఎంట్రీతో నిలబెట్టి బాక్సాఫీసుల వద్ద కాసుల వర్షం కురిపించాడు.
ప్రస్తుతం డిక్టేటర్ లో కూడా మెరవనున్న ఈ స్టార్ ని కదిలిస్తే కొన్ని ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. నటసింహం బాలయ్య అంటే ఆయనకి ఎంతో ఇష్టమట. బాలయ్య పక్కన కూర్చోవటం నా పూర్వ జన్మ సుకృతం అని చెబుతున్నాడు. బాలయ్య చాలా ఓదిగి ఉండే మనిషి. వివాదాల జోలికి అస్సలు వెళ్లరు. డిసిప్లేన్ గా ఉంటారు. దేవుడిని నమ్మండి నిజాయితీగా ఉండడి ఇవి తరచూ ఆయన చెప్పే మాటలు అందుకే నేను ఆయన అభిమానిని అంటూ చెప్పుకోచ్చాడు పృథ్వీ. అన్నట్లు లౌక్యంలో బాలయ్య బాబును ఇమిటేట్ చేయటమే కాదు. అప్పట్లో రాజకీయ కథాంశంగా వచ్చిన గండిపేట రహస్యం అనే చిత్రంలో స్వర్గీయ నటుడి ఎన్టీఆర్ ను ఇమిటేట్ చేస్తూ లీడ్ పాత్రను పోషించాడీ పర్సంటేజ్ పరమేశ్.