చెన్నై సొగసరి త్రిష సినిమా రంగంలోకి వచ్చి పదమూడేళ్లు అవుతున్నా ఇంకా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఎంగేజ్ మెంట్ అయినా వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల తన మేనేజర్ గిరిధర్ కోసం ఓ చిత్రాన్ని చేయనున్నట్టు త్రిష ప్రకటించిన సంగతి తెలిసిందే. హర్రర్ కామెడి కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని కూడా అప్పట్లో తెలియజేసింది. అయితే త్రిష పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను నిర్మాత మామిడిపల్లి గిరిధర్ వెల్లడించారు. ‘నాయకి’ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కనుందట. త్రిష ఇప్పటి వరకు చేయని ఉమెన్ ఓరియెంట్ చిత్రమని, ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, తమిళంలో రూపొందించనున్నారట. లవ్ యు బంగారం ఫేమ్ గోవి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడట. త్వరలోనే మిగతా ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం త్రిష ‘లయన్’ మే 8న విడుదల కానుంది.