సినిమా కథలకూ, టైటిల్స్ కూ ఎన్ని తిప్పలు వచ్చాయండీ బాబూ... ఈ కథ మాదంటే.. ఈ టైటిల్ మాదంటూ గగ్గోలు పెట్టేస్తున్నారు. నిజానికి కొందరు సినిమా తీయడం మాట అటుంటి టైటిల్ మాత్రమే రిజిస్టర్ చేసి, ఆ తరువాత అలాంటి టైటిల్ ఎవరైనా పెట్టుకుంటే గోల షురూ చేస్తున్నారు. గతంలో పవన్, బాలయ్య బాబు, ఎన్టీఆర్ వంటి స్టార్లకు ఇలాంటి సమస్యలొచ్చాయి. అప్పుడు ఈ విషయంగా ఏపీ ఫిలిం చాంబర్ కల్పించుకొని సర్దిచెప్పారు. ఇప్పుడేమో సూపర్ స్టార్ రజినీ కాంత్ టైటిల్ కే ఈ సమస్య ఎదురైంది. రజినీకాంత్ హీరో గా రంజిత్ దర్శకత్వంలో కళైపులి ఎస్.థాను నిర్మిస్తున్న తాజా చిత్రం ఆన్ సెట్స్ వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈలోగానే టైటిల్ 'కబాలి' అంటూ ప్రచారం సాగించారు. అయితే ఈ టైటిల్పై ఇప్పటికే ఓ సినిమా తెరకెక్కుతోందన్నది తాజా అప్ డేట్.
తమిళ సీనియర్ నిర్మాత శివకుమార్ ఇప్పటికే ఈ టైటిల్ ని తమిళ ఫిలింఛాంబర్ లో రిజిష్టర్ చేయించారట. పైగా సినిమా షూటింగ్ 90శాతం పూర్తయిందని కూడా అంటున్నారట. ఇప్పుడు రజనీ టైటిల్ కూడా ఇదే కావడంతో ఈ టైటిల్ తనదంటూ గగ్గోలు పెడుతున్నారు. అన్నిచోట్లా రిజిష్టర్ చేయించానంటూ శివకుమార్ మొరపెట్టుకున్నారు. మొత్తానికి పెద్దలు ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరిస్తే రజినీకాంత్కు డాన్ కబాళ పవర్ ఫుల్ టైటిల్ దక్కుతుంది.