లెజెండ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు...

June 10, 2015 | 12:04 PM | 0 Views
ప్రింట్ కామెంట్
balakrishna_birth_day_june_10_niharonline

నందమూరి వంశపు రెండో తరం హీరో బాలకృష్ణ. తండ్రి ఎన్నో విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించాడు. ఈ తనయుడు మాత్రం కేవలం కమర్షియల్ సినిమాలకే పరిమితమై సింహంలా గర్జిస్తున్నాడు. ఆయన సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగులకు పెట్టింది పేరు. ఆయన సినిమాలంటే మాటల రైటర్లకు పవర్ ఫుల్ పంచులు పడిపోతుంటాయి. తన నలభై ఏళ్ళ సినీ కెరీర్ ను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇప్పటికీ టాప్ హీరోల స్థాయిని కొనసాగిస్తున్నడు. తన వ్యక్తిత్వంతో తండ్రిగారి పేరును నిలబెడుతున్న నందమూరి వారసుడీయన. ఎంతో మంది అభిమానులకు ఆయనొక నటసింహం. వెండితెర మీద ఆయన సినిమాలు బాక్సాఫీస్ కలెక్షన్లు తిరగరాస్తున్నాయి. తండ్రి మాదిరిగానే తాత వయసు వచ్చినా హీరోగా అలుపులేకుండా సినీ ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నాడు. నేడు నందమూరి బాల కృష్ణ 55వ పుట్టిన రోజు.

ఈ వయసులో కూడా అదే జోష్, అదే పవర్. ఆ గుండె వెనకున్న దమ్ముకు, ఎనర్జీకి అభిమానులు ఆ వ్యక్తికి నీరాజనాలు పడుతున్నారు.  మొన్నీమధ్యే తాతయిన ఈ హీరో...  కుమారుడు కళ్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్ తో సమానంగా స్టెప్పులేస్తూ... ఫైట్స్ చేస్తూ హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఈ డైనమిక్ హీరోకు నీహార్ ఆన్ లైన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ