‘లెజెండ్’ సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్.ఎల్.వి.సినిమా బ్యానర్ పై సత్యదేవ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మించిన చిత్రం ‘లయన్’. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈరోజు సెన్సార్ కి రెడీ అయింది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన చిత్రంలో బాలయ్య సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్ర నిడివి దాదాపు రెండున్నర గంటలు ఉందని వినికిడి. యాక్షన్ ఎంటర్ టైనర్ కాబట్టి ఈ చిత్రానికి సెన్సార్ 'యు/ఎ' రావచ్చునని సమాచారం . మరి రేపటి వరకు ఆగితే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. సినిమాని మే 8న, ఉదయం పది గంటల నాలుగు నిమిషాలకు విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది.