భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై వి.ఎస్.వాసు దర్శకత్వంలో దాసరి భాస్కర్ యాదవ్ నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘టోల్‌ఫ్రీ నెంబర్ 143’ ఇది చాలా కాస్ట్ గురూ అనేది ట్యాగ్‌లైన్. శ్రీహరి ఉదయగిరి, హేమంతిని, రోషిక, మహావీర్, అస్రిద్ మాధుర్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 28న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఈ సోమవారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో...
చిత్ర దర్శకుడు వి.ఎస్.వాసు మాట్లాడుతూ ‘‘ ఈ సినిమా విషయానికి వస్తే ప్రేమ విషయం చెప్పే వరకు తర్వాత అది చాలా కాస్ట్ అయిపోతుందనేది ఈ సినిమా కాన్సెప్ట్. చిత్ర నిర్మాత భాస్కర్‌యాదవ్‌గారు నామీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదని,ఒక మంచి సినిమా చేశానని అనుకుంటున్నాను. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. శ్రీవెంకట్ మంచి సంగీతాన్నిచ్చాడు. సినిమా 28న విడుదలవుతుంది. సహకారం అందించిన ప్రతి ఒక్కరికి థాంక్స్’’అన్నారు.
చిత్ర నిర్మాత దాసరి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ ‘‘ఇప్పటి జనరేషన్‌లో 143 అంటే ఐలవ్‌యు అనే పదానికి వున్న అర్థాన్ని చెడగొడుతున్నారు. దానికి నైతిక విలువలు లేకుండా ఏవిధంగా చేస్తున్నారనే విషయాన్ని ఇందులో చూపించడం జరిగింది. అంతే కాకుండా ఇప్పటి యువత ఏవిధంగా డ్రగ్స్‌కి బానిసలు అవుతున్నారు అనేది కూడా ఇందులో చూపిస్తున్నాం. యూత్‌కి ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్‌ని కూడా చెప్తున్నాం. శ్రీవెంకట్ మంచి మ్యూజిక్‌నిచ్చారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాని ఈ నెల28న విడుదల చేస్తున్నాం. సినిమా బాగా రావడానికి యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో సపోర్ట్ చేశారు అందరికి థాంక్స్. అందరికీ తప్పకుండా నచ్చే సినిమా అవుతుంది’’ అన్నారు.
హీరో శ్రీహరి ఉదయగిరి మాట్లాడుతూ ‘‘యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్. దాంతోపాటు మంచి మెసేజ్ ఉంటుంది. 28న విడుదలవుతున్న ఈ చిత్రం అన్నీ వర్గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం ఉంది’’ అన్నారు.
హీరోయిన్ ఇషిక మాట్లాడుతూ ‘‘ప్రేమ చాలా విలువైనది. అలాగే దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని ఒకవైపు పాజిటివ్, మరో వైపు నెగటివ్ చూపిస్తూ డైరెక్టర్ వాసుగారు చక్కగా డైరెక్ట్ చేశారు. నిర్మాతగారు ఎక్కడా కాంప్రమైజ్ సినిమాని నిర్మించారు. యూత్‌తోపాటు ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. 28న విడుదలయ్యే ఈ సినిమాని ఆదరిస్తారని నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో రచయిత మహేష్, సంగీత దర్శకుడు శ్రీవెంకట్ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణభగవాన్, సుమన్‌శెట్టి, రోలర్ రఘు, ధన్‌రాజ్, చమ్మక్ చంద్ర, సంధ్యారaనక్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మహేష్ ఎల్., సంగీతం: శ్రీవెంకట్, సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్ సబ్బి, ఎడిటింగ్: సత్య గిడుతూరి, ప్రొడక్షన్ డిజైనర్: బన్సి కె., డాన్స్: పాల్ వేణు, ఫైట్స్: రవి, నిర్మాత: దాసరి భాస్కర్‌యాదవ్,కథ`స్క్రీన్‌ప్లే`దర్శకత్వం: వి.ఎస్.వాసు.