కమెడియన్ పొట్టి రాంబాబు కన్నుమూత

December 29, 2015 | 10:42 AM | 2 Views
ప్రింట్ కామెంట్
Comedian-Potti-Rambabu-Passed-Away-Niharonline

టాలీవుడ్ లో వరుస మరణాల పరంపర కొనసాగుతోంది. పలు చిత్రాల్లో కమేడియన్ గా నటించి మెప్పించిన పొట్టి రాంబాబు(35) ఈరోజు ఉదయం మరణించాడు. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టి, ఆపై స్ట్రోక్ రావడంతోనే మృతి చెందినట్టు తెలిసింది. పొట్టి రాంబాబు 40కి పైగా చిత్రాల్లో నటించాడు. ఈశ్వర్, క్లాస్ రూమ్, చంటిగాడు, ప్రేమతో నువ్వు వస్తావని వంటి సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేశాడు. ఇటీవల 'పులిరాజా ఐపీఎస్' పేరిట పొట్టి రాంబాబు హీరోగా ఓ చిత్రం కూడా ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, 2015 టాలీవుడ్ కు అత్యంత విషాదాన్ని మిగిల్చిన సంవత్సరంగా మారింది. కేవలం 10 రోజుల్లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన 5 గురు వ్యక్తులు మరణించడం తెలిసిందే.

                                   సంగీత దర్శకుడు  దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి మరణంతో ప్రారంభమైన ఈ చావుల మేళా వరుసగా 5 గురిని పొట్టన పెట్టుకుంది . అదే రోజు మరో రచయిత శ్రీనివాస్ చక్రవర్తి అనారోగ్యంతో కన్ను మూయగా ,ఆ తర్వాత మరో సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ తల్లి బాత్ రూమ్ లో జారిపడి అపస్మారక స్థితిలో చనిపోయింది . ఇక ఆ తర్వాత నాటకరంగ ప్రముఖుడు పలువురు అగ్ర హీరోలకు నటనలో శిక్షణ ఇచ్చిన చాట్ల శ్రీరాములు కూడా అనారోగ్యంతో మరణించడం ఆ తర్వాత 300 కు పైగా చిత్రాల్లో నటించిన రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడంతో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ అయ్యింది .  మరో రెండు రోజుల్లో ఏడాది ముగియనుండగా కూడా మరో నటుడు దూరమై తెలుగు సినీ కళామతల్లికి మరింత శోకాన్ని కలిగించాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ