ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అడుసుమిల్లి వెంకటేశ్వర రావు బుధవారం ఉదయం కన్నుమూశారు. పసిబాబు గా తెలుగు చిత్రపరిశ్రమలో పలు చిత్రాలు నిర్మించారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు దృవీకరించారు. 1990 నుంచి 2000 సంవత్సరాల మధ్య ఆయన పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహారించారు. కృష్ణ హీరోగా నంబర్ చిత్రాన్ని, జగపతి బాబు హీరోగా శుభలగ్నం లాంటి హిట్ చిత్రాలను ఈయనే నిర్మించారు. ఈ రెండు చిత్రాలకు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడు కావటం విశేషం. కాగా ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. టాలీవుడ్ ఓ పెద్దను కోల్పోయిందని పలువురు పేర్కొన్నారు. నీహార్ ఆన్ లైన్ ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తుంది.