టాలీవుడ్ టెక్నీషియన్ మధుసూదన్ రెడ్డి ఇక లేరు

April 20, 2015 | 03:35 PM | 79 Views
ప్రింట్ కామెంట్
dts_madhu_sudhan_reddy_no_more_niharonline

సినిమా చూసేటప్పుడు అన్ని కోణాల్లోంచి చూసే వారు చాలా తక్కువ మంది ఉంటారు. కథ నటీనటులను చూసినంతగా మిగతా సాంకేతిక నిపుణులను చాలా కొద్ది మందే చూస్తారు. సౌండ్ ఒకరిస్తే, బొమ్మల్ని మరొకరు వదలుతారు. ఈ రెంటినీ మిక్స్ చేసి సినిమాకు ఎంత తీసుకోవాలి. ఏ సౌండ్ ఎంత ఇవ్వాలి చూపించే వారే ఆడియో గ్రాఫర్. ఈ ఆడియో గ్రాఫర్ పేరు అందరూ వినే ఉంటారు. మధుసూదన్ రెడ్డి. దాదాపు ప్రతి పెద్ద సినిమాకు ముందు వేసే టైటిల్ లో డిటిస్ మిక్సింగ్ అంటూ ఈయన పేరును చూస్తుంటాం. టాలీవుడ్ కు ఈ రెండు సంవత్సరాల్లో చేసుకున్న దురద్రుష్టం ఇప్పుడు ఈయనను కూడా దూరం చేసుకుంది. ఈ రోజు ఉదయం ఆయన గుండెపోటుతో మరణించారు. ఎన్నో అవార్డులు అందుకున్న ఈయన ఒక్కడు, అరుంధతి, మనం లాంటి మంచి సినిమాలకు అద్భుతమైన సౌండ్ ఎఫెక్స్ అందించారు. టాలీవుడ్ ఓ మంచి టెక్నీషియన్ ను కోల్పోయిన దుర్దినం నేడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ