ఇది నిజంగా తెలివైన ట్రిక్ అనే చెప్పాలి. ఎంత బాగున్నా కొత్త ముఖాల్ని చూడ్డానికి పెద్దగా ఇష్టపడడం లేదు జనాలు.చిన్న సినిమాలు ప్రోమోషన్ లతో ఎంత ఊదర గొట్టినా... థియేటర్లలో నిలబడాలి.. బాగుందన్న టాక్ తెచ్చుకోవాలి... అప్పుడే చిన్న సినిమాలు బతికి బట్టకడుతున్నాయి. రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున మహేష్ చిత్రం ''శ్రీమంతుడు ''రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే . ఈ సమయంలోనే ఓ చిన్న సినిమా ‘కలయా-నిజమా’ను రిలీజ్ చేస్తున్నారు. పెద్ద సినిమా రిలీజ్ చేసిన రోజే తమ సినిమాలకు కలెక్షన్ రాదని చిన్న సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడతారు. కానీ ఆ పెద్ద సినిమాకు సినిమాకు టికెట్లు దొరకనప్పుడు ఏదో ఒక సినిమా చూద్దామనుకునే వాళ్ళూ ఉంటారుగదా. అలా కూడా ఈ సినిమాకు క్యాష్ చేసుకోవచ్చు మరి. రాజ్ ,గీతా భగత్ లను హీరో హీరోయిన్ లుగా పరిచయం చేస్తూ మహేష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ''కలయా నిజమా ''. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పై మాకు నమ్మకం ఉంది కాబట్టే మహేష్ చిత్రానికి పోటీగా రిలీజ్ చేస్తున్నామని కొన్ని సెంటర్ల లో 7తారీఖున మరికొన్ని సెంటర్లలో 8న మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని ద్వేషాన్ని జయించమని ,ప్రేమని పంచమని చెబుతున్నామని అంటున్నాడు దర్శక నిర్మాత మహేష్ .