కంటెంట్ కన్నా బూతే మిన్నా!

September 22, 2015 | 10:37 AM | 5 Views
ప్రింట్ కామెంట్
trisha-illana-nayanthara-movie-collections-better-than-maya-niharonline

ఇటీవలి కాలంలో బూతు కంటెంట్ లేని సినిమాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలకు ఆదరణ చాలా తగ్గిపోయింది. ప్రయోగాత్మకంగా ఏదైనా చిత్రాన్ని తీస్తే కేవలం ప్రశంసల తోనే సరిపెడుతున్నారు తప్ప కమర్షియల్ గా అది ఆడట్లేదు. ముఖ్యంగా యూత్ ని అట్రాక్ట్ చేస్తూ తీసే సినిమాలకు ఆదరణ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే టాలీవుడ్ మాత్రం దీనికి మినహాయింపు. ఈ మధ్య తెలుగులో ఫ్యామిలీ ఆడియన్స్ చిత్రాలే ఎక్కువగా రావటం, అవి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనాలు సృష్టించడం ట్రెండ్ గా మారింది. సన్నాఫ్ సత్యమూర్తి, బాహుబలి, శ్రీమంతుడు, భలే భలే మగాడివోయ్ ఈ కోవలోకే వస్తాయి.  అడపాదడపా అడల్ట్ కంటెంట్ చిత్రాలు వస్తున్నా అవి ఓ మాదిరిగా ఆడి వెళ్లిపోతున్నాయే తప్ప పెద్దగా లాభం లేకుండా పోతుంది.  అయితే కోలీవుడ్ లో మాత్రం స్టోరీ కన్నా అడల్ట్ కంటెంట్ చిత్రాలకే ఆదరణ ఉంటుందని మరోసారి రుజువు అయ్యింది.

                             ఆ మధ్య ఢిల్లీ బెల్లీ రీమేక్ సెట్టై (తెలుగులో క్రేజీ) తమిళంలో ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలవగా, తాజాగా మరో చిత్రం ఆ కోవలోకి చేరింది. అదే త్రిష ఇల్లానా నయనతార.  సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ హీరోగా, తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్ గా (బస్ స్టాప్ ఫేమ్) ఈ చిత్రం తెరకెక్కింది. పూర్తిస్థాయి అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. పూర్తిగా నెగటివ్ రివ్య్సూ వచ్చాయి. అర్థంపర్థం లేని స్టోరీ, డబుల్ మీనింగ్ డైలాగులు, బూతు జోకులు, లిప్ లాకులు ఇలా చాలానే ఉన్నాయి అంటూ విమర్శకులు ఏకీ పాడేశారు. అయితే కలెక్షన్లో మాత్రం ఇది అక్కడ ఇప్పుడు ప్రభంజనం అయ్యి కూర్చుంది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిన్న సినిమా తొలి నాలుగు రోజుల్లోనే పది కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ రూ.7.5 కోట్ల దాకా ఉంది. ఇక ఫుల్ రన్ లో కనీసం 25 కోట్లు దాకా గ్రాస్ కలెక్ట్ చేస్తుందని అంచనా. ఇంతకీ సినిమా బడ్జెట్ ఎంతో తెల్సా? కేవలం రూ.5 కోట్ల లోపే.

సోమవారం కూడా స్టడీగా ఉన్న ఈ సినిమా కలెక్షన్లు హిట్ టాక్ తెచ్చుకున్న నయనతార మూవీ ‘మాయ’ని వెనక్కి నెట్టి మరీ తమిళ బాక్సాఫీస్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. మాయా సినిమా హిట్ టాక్ రావటంతోపాటు రివ్య్సూ కూడా సూపర్ అని తేల్చాయి. అయినా కూడా మాయా కలెక్షన్లు మాత్రం ఓ తలా తోక లేని సినిమా కలెక్షన్ల కంటే తక్కువగా ఉండటం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచేదే. అన్నట్లు త్వరలో ఇది తెలుగులో త్రిష లేదా నయనతారగా రాబోతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ