నాన్న గొప్పతనం అదే అంటున్న త్రివిక్రమ్

April 07, 2015 | 12:56 PM | 52 Views
ప్రింట్ కామెంట్
trivikram_about_sun_of_satyamuthy_niharonline

ఈ ఏప్రిల్ 9న ‘జులాయి’ కాంబినేషన్ అల్లుఅర్జున్, త్రివిక్రమ్ మరోసారి ‘సన్నాప్ సత్యమూర్తి’ గా మన ముందుకు రానున్నారు. ఈ సినిమా ఆడియో సక్సెస్ మీట్ నిన్న విజయవాడలో జరిగింది. మనం ఎక్కువగా అమ్మ గురించే మాట్లాడుతుంటాం. అయితే నాన్న మనకు తన పేరుని, ప్యామిలీ పేరుని ఇచ్చి సంస్కారం నేర్పి, తన ఒళ్లో కూర్చొని పెట్టుకుని ప్రపంచాన్ని చూపిస్తారు. కావ్యాల్లో, పురాణాల్లో తండ్రి పాత్రకు దక్కిన స్థానం తక్కువే. తండ్రి గురించి మనకు తెలిసే సరికి మనకు దూరమైపోయి ఉండవచ్చు. కానీ మనం ఒంటరిగా ఉన్నామనకుంటాం కానీ కానీ నేనున్నానంటూ తండ్రి నీడలా మన వెనుకే ఉండి మనల్ని నడిపిస్తాడు. అదే తండ్రి గొప్పతనం అదే ఈ సినిమాలో నేను చూపించే ప్రయత్నం చేశానంటూ త్రివిక్రమ్ తెలియజేశాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ