ఆడియో ఆవిష్కరించబోయే తేదీని ముందుగానే అనౌన్స్ చేస్తూ... ఈ విధంగా కూడా తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటుంటారు సినిమా వాళ్ళు. కానీ అదేమిటో ఆరంభం అట్టహాసంగా చేసిన ఇళయదళపతి విజయ్ సినిమా ‘పులి’ ఆడియోను ఎవరికీ పబ్లిసిటీ ఇవ్వకుండా గుట్టుగా కానిచ్చేశారు. దీనివెనుక కారణాలేమిటనేది ఈ సినిమా యూనిట్ కే తెలియాలి. పైగా ప్రముఖులు, హేమాహేమీలు ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమా తెలుగు హక్కులను ఎస్వీఆర్ మీడియా 8 కోట్లు వెచ్చింది. ఇంత భారీ రేటుకు కొనుక్కున్న ఈ సినిమా ఆడియో లాంచింగ్ ఎందువల్ల ఇంత గుట్టుగా జరిపారనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చ అవుతోంది. శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్ కె టి స్టూడియోస్ బ్యానర్‌పై శింబు తమీన్స్, పి టి సెల్వకుమార్ నిర్మాతగా నిర్మిస్తున్న పులి చిత్రం భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కినట్టు ఊదరగొట్టారు కొన్నాళ్ళు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. తెలుగులో చిత్రాని ఎస్ వి ఆర్ మీడియా బ్యానర్‌పై సి జె శోభ విడుదల చేస్తున్నారు. ఆడియో సి డీ ని హీరో విజయ్ తల్లి శోభ చంద్రశేఖర్, విజయ్ సతీమణి సంగీత ఆవిష్కరించారు. ఈసందర్బంగా ఇళయ దళపతి విజయ్ మాట్లాడుతూ ‘‘నాకు చాల రోజులుగా తీరని కోరిక తీరింది. ఒక హిస్టరికల్ బేస్‌డ్ చిత్రంలో నటించాలి. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవీ మిస్ కాకుండా ఉండాలని కోరిక ఉండేది. ఈ పులి చిత్రంతో ఆ కోరిక తీరిపోయింది. పులి కడుపున పులే పుడుతుందనే విధంగా కమల్ తనయ శృతిహాసన్ ఈ చిత్రంలో నటించింది.అలాగే ముంబాయ్ దక్షిణాదికి ఇచ్చిన నిధి హన్సిక, ఇద్దరూ పోటీ పడి నటించారు. శ్రీదేవి గారు ఈ చిత్రంలో కీలక పాత్ర లో నటించారు. ఆవిడ దాదాపు 27ఎళ్ల తరువాత నా చిత్రంలో నటించినందుకు థ్యాంక్స్ చేప్పుతున్నాను. దర్శకుడు చింబుదేవన్ చేసిన కొత్త ప్రయత్నమే ఈ చిత్రం‘‘ అన్నారు. శ్రీదేవి మాట్లాడుతూ ‘‘తమిళ్‌నాడు నాకు ఎప్పుడు అమ్మగారిల్లే. చాల ఎళ్ల తరువాత తమిళంలో నేను చేస్తున్న చిత్రం ఇది. విజయ్ ఒక ప్రొఫెషనల్ హీరో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే హీరో. మంచి టీమ్ వర్క్ తో చేశాను. ఎంటైర్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’అన్నారు. దర్శకుడు చింబుదేవన్ మాట్లాడుతూ ‘‘విజయ్ కథ వినగానే ఇది అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రం అవుతుంది. తప్పకుండా మనం కలసి చిత్రం చేస్తున్నాం అన్నారు.
అప్పటి నుండి నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకు పోయారు. నిర్మాతలు ఈ చిత్రం కోసం డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, కో డైరెక్టర్స్ గా పని చేశారు. శ్రీదేవి, సుదీప్ విలక్షణమైన పాత్రలు పోషించారు. లవ్,యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో సరికొత్త విజయ్ కనిపిస్తారు అన్నారు‘‘ ఈ కార్యక్రమాంలో టి రాజేంద్రన్, ఎస్ వి ఆర్ మీడియా సి జె శోభ, వైరముత్తు హన్సిక, శృతిహాసన్, దేవిశ్రీప్రసాద్, ఎస్ ఎ చంద్రశేఖర్, నిర్మాత శింబు తమీన్స్ , పి టి సెల్వ కుమార్ తదితరులు పాల్గొన్నారు.