వర్మ మారిపోయాడా?

May 05, 2015 | 04:11 PM | 137 Views
ప్రింట్ కామెంట్
rgv_change_his_attitude_niharonline

రామ్ గోపాల్ వర్మలో చాలా మార్పు వచ్చింది. ఈ మధ్య బాలీవుడ్ లో సినిమాలు తీయడం మానేశాడు. వరుసగా తెలుగు సినిమాలనే చేస్తున్నాడు. అందులోనూ బంధాలు, అనుబంధాలతో సినిమాలను చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా యు సర్టిఫికెట్ సినిమాలను తీస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే రామ్ గోపాల్ వర్మలో చాలా మార్పు వచ్చిందనే అనిపిస్తోంది. వర్మ 25 ఏళ్ల ఫిల్మ్ కెరీర్లో ఆయన తెరకెక్కించిన చిత్రానికి మొట్టమొదటి సారిగా యు సర్టిఫికెట్ వచ్చింది. ఈ విషయాన్ని వర్మ స్వయంగా ఒప్పుకున్నాడు. ట్విట్టర్ లోనూ పోస్ట్ చేశాడు. 365 డేస్ నా 25 ఏళ్ల ఫిల్మ్ కెరీర్లో మొట్టమొదటి యు సర్టిఫికెట్ చిత్రం... ఇందులో ప్రేమ అనురాగాలు బంధాలు తప్ప క్రైము రక్తపాతాలు లేవు అని ఆ పోస్ట్ లో రాసి ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ