రాంచరణ్ బ్రూస్ లీ సినిమాపై తనదైన శైలిలో విమర్శో, పొగడ్తో అర్థం కాని విధంగా ట్వీటాడు. ఒక పక్క మెగా అభిమానిగా చెప్పుకుంటూనే... సినిమాపై సెటైర్లు వేశారు. ఇదే టైటిల్ పై ఆయన ఓ సినిమా చేస్తున్నారు... విమర్శలు చేయడానికి రెడీగా ఉండే వర్మ తన సినిమా లేడీ బ్రూస్ లీని ఏ విధంగా తెరకెక్కించనున్నారో మరి.
వర్మ బ్రూస్ లీ సినిమా బావుందని చెపుతూనే.... అసలైన ‘బ్రూస్ లీ' అభిమానిగా తను నిరాశపడ్డానని అంటున్నాడు. ఈ సినిమాకు ‘బ్రూస్ లీ' అనే టైటిల్ పెట్టకుండా ఉంటే చెర్రీ సినిమా మరింత బాగుండేదంటున్నాడు. చిరంజీవి గెస్ట్ రోల్ గురించి చెపుతూ ఇది ఆయన 150వ సినిమా అంటున్నాడు. ఈ సినిమాలో ఆయన గెస్ట్ రోల్ కు ఎందుకు ఒప్పుకున్నారని అన్నాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినట్లే చిరంజీవి తన 150వ సినిమాను ఎన్నుకున్నాడని అన్నాడు. చిరంజీవి 151వ సినిమా తమిళ కాపీ కావడం ఏం బాగాలేదు. రాజమౌళి సినిమా 100 రోజులు పూర్తి చేసుకుని తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన బాహుబలిలా ఉండాలని అన్నారు.