గ్రామాల దత్తత ఈగోను శాటిఫై చేసుకోడానికే: వర్మ

September 23, 2015 | 05:06 PM | 2 Views
ప్రింట్ కామెంట్
ram-gopal-varma-commented-mahesh-vishnu-prakashraj-niharonline

సంచలన దర్శకుడు మళ్ళీ మహేష్ బాబుపై సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు సంధించాడు. కొన్నాళ్ళుగా కామ్ గా ఉన్న రాం గోపాల్ వర్మకు మహేష్ దత్తత కార్యక్రమంపై వ్యాఖ్యలు చేయాలనిపించింది. ఆయన డబ్బున్న వాళ్ళు గ్రామాలను దత్తత తీసుకోవడం తప్పుగా అనిపించిందట.  ఇటీవలే మహేష్ బాబు, ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వంటి హీరోలు గ్రామాలను దత్తత తీసుకోవడం ఈయనకు ఏ మాత్రం నచ్చలేదట. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలంటూ వర్మ పిలుపునిస్తున్నాడు. దత్తత తీసుకోవటానికి మొదటి కారణం తమ ఈగోని తృప్తిపరుచుకోవటానికేనట. దత్తత తీసుకున్న వాళ్లు తామేదో ఆ గ్రామానికి రాజులా ఫీలవుతారని, తమ దయా దాక్షణ్యాలపై ఆ గ్రామస్తులు ఆధారపడి బతుకుతున్నారనే ఈగో ఉంటుందని రాసుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ. చాలా గ్రామాల్లో కంటే అమీర్‌పేట్‌లో చాలామంది పేద వాళ్లు ఉన్నారని, వాళ్లని ఎవరైనా దత్తత తీసుకోవాలని సూచించాడు. గ్రామాల్లో కనీసం పచ్చటి పొలాలు, స్వచ్ఛమైన గాలి ఉంటుందని (ఈయన వెళ్ళారా ఏ డ్రై ఏరియాకైనా...) సిటీలో బాగా పొల్యూషన్ పేరుకు పోయిందనీ, ఇక్కడ పేద ప్రజల బాగోగులు చూడకుండా గ్రామాలకు ఎందుకు వెళ్ళారని అంటున్నారు. గ్రామాలను నగరాల్లా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలి తప్ప వారి దయా దాక్షణ్యాలపై ఆదారపడేలా చేయకూడదని సలహా ఇచ్చాడు. చిన్న స్థాయి నటుడు గ్రామాన్ని దత్తత తీసుకుంటే స్టార్ హీరోలు చాలా గ్రామాలను దత్తత తీసుకోవాలి కదా అంటూ ప్రశ్నించాడు. అలా ఆత్మగౌరవం ఉన్న గ్రామాలు ఈ దత్తతను వ్యతిరేకించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దత్తత తీసుకోవడం ద్వారా గ్రామాల ఆత్మగౌరవాన్ని కించపరచినట్టవుతుందని అంటున్నాడు. వర్మ చేసిన ఈ వ్యాఖ్యలకు అభిమానుల నుంచి, మహేష్ బాబు నుంచి ఎలాంటి కామెంట్లు పడతాయో చూడాలి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ