వర్మాజీ ఎందుకీ పొగడ్తలూ... తెగడ్తలూ...?

July 15, 2015 | 04:57 PM | 3 Views
ప్రింట్ కామెంట్
ramgopal_varma_chiru_150_movie_niharonline

వర్మ ఈ మధ్య కొన్ని సినిమాలను అతిగా పొగిడేస్తున్నారు. జూనియర్లనుంచి సీనియర్లు చాలా గొప్పనేశాడు... మళ్ళీ సారి చెప్పడాలూ... ఇదంతా ఎందుకో అర్థం కాదు... వర్మ కామెంట్లు చూసి టెంపర్ వీరలెవెల్ లో ఉందనకున్నారు కొందరు... కానీ పొగిడేంతటి... అది కూడా సీనియర్ ఎన్టీఆర్ తో పోల్చేంతటి గొప్ప ఏముందని? అనుకున్నారు కొందరు విమర్శకలు. ఇప్పుడేమో బాహుబలి భజన బాగా చేసేస్తున్నారు. ఈ సినిమాను గానీ, సినిమాలోని నటులను గానీ ఇతర సినిమాల్తోనూ, హీరోలతోనూ పోల్చడం అనేది ఏ మాత్రం కరెక్టు కాదు. ఎందుకంటే మళ్ళీ అలాంటి పాత్రలు చేస్తేనేగానీ ఇతర నటీనటుల ప్రతిభ గురించి మాట్లాడాలి. ఆ సినిమానే వేరు... ఆ కథే వేరు...  ఇప్పుడు మహేష్ సినిమాను తక్కువ చేయడం కూడా కరెక్టు కాదు. ఇప్పుడిక వర్మ దృష్టి చిరంజీవి 150వ సినిమా మీద పడింది. బాహుబలి తర్వాత దానికి దగ్గరగా రాగలిగే సినిమా మెగాస్టార్ 150వ చిత్రమే. ఆ సినిమా బాహుబలి స్థాయిలో లేకుంటే మెగా ఫ్యాన్స్ చాలా నిరాశపడతారట.  బాహుబలి కంటే భారీగా ఉంటేనే ఏడేళ్ల పాటు మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులకు అర్థం ఉంటుందని... అని ట్వీట్ చేయడం ఏమిటి? ఒక పోకిరీకి... ఒక కార్తికేయకు... ఒక ప్రేమమ్ కు పొంతన కుదురుతుందా? ఏ సినిమా గొప్పదనం ఆ సినిమాదే... బాహుబలి ఒక ప్రత్యేకమైన సినిమా. ఇది ఏ సినిమాతోనూ పోల్చదగింది కాదు. మగధీర... తీసిన రాజమౌళి ఈగ తీశాడు... సింహాద్రి తీశాడు... ఇందులో ఏది తక్కువ ఏది ఎక్కువ? ఇప్పుడు మహేష్ తో తీసే సినిమా మళ్ళీ బాహుబలి స్థాయిలో తీయగలడా? ఎందుకండీ వర్మగారూ ఈ రెచ్చగొట్టే ట్వీట్లు....

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ