అన్యోన్యంగా ఉండే జంటలంటే వర్మకు బోర్ అట...!

May 07, 2015 | 11:47 AM | 80 Views
ప్రింట్ కామెంట్
Ramgopal_Verma_about_365_days_niharonline

ఈసారి వర్మ కామెంట్ ఇంట్లో వాళ్ళ వైపు మళ్ళింది... కాకపోతే, ఈ కామెంట్ చాలా పాజిటివ్ గా తీసుకోవాల్సిందనుకోండి.... అయితే సాధారణంగా ఏ పేరెంట్స్ అయినా తమ పిల్లలు చాలా అన్యోన్యంగా ఉంటే చూసి ఆనందిస్తారు... మరి వర్మ నా రూటే సపరేటు అంటారు కదా ఎప్పుడూ... అందుకే ఈ విషయంలోనూ భిన్నంగా ఆలోచిస్తున్నాడా(నిజంగానేనా?) తన కొత్త సినిమా ‘365 డేస్' సినిమా ప్రెస్ మీట్ సందర్భంగా వర్మ ఓ ప్రశ్నకు స్పందిస్తూ- తన ద్రుష్టిలో కూతురు-అల్లుడూ బోరింగ్ కపుల్ అంటున్నారు. కారణం ఎంతో అన్యోన్యంగా, ప్రేమగా వాళ్ళు ఉండటమేనట. తనకు గొడవ పడే కపుల్స్ అంటేనే ఇష్టమట... అలాంటివారితోనే కొత్త స్క్రిప్ట్ లు రెడీ చేసుకోవచ్చట. (మీ స్క్రిప్టుల కోసం వాళ్ళు గొడవపడాలా?) ఇంకా తన కూతురు తన భావాలకు పూర్తి వ్యతిరేకం అని చెప్పుకున్నాడు. ప్రతి విషయంలో సంప్రదాయబద్దంగా ఉంటుందట. తండ్రిని వేరే జాతి వాడిలా చూస్తుందట... జూలో జంతువులా కూడా.... తను బావిలో కప్పలా బతుకుతున్నాడని అంటుందట. ఆయన అనుకునేలా ఈ ప్రపంచం లేదని అంటుందట. అయినా ఈ సినిమా కథను గురించి ఆమెతో చర్చించాడట (ఇన్ని మాటలనే కూతురుతో చర్చించారంటే... ఆమె చేసే కామెంట్లు బయటికి చెప్పలేనంత నచ్చుతున్నాయన్నమాటేగా...). ఆమె సలహాలు ఈ సినిమాలో తీసుకున్నాడట. (అందుకే కాబోలు ఆయన మైండ్ సెట్ కు విరుద్ధంగా తీసానని ఒప్పుకున్నాడు) ఇంకా ఈ సినిమా గురించి చెపుతూ.- .ప్రేమికుల్లోగాని, వైవాహిక జీవితంలో వున్న భార్యభర్తల మధ్యగాని చోటుచేసుకునే భావోద్వేగాలు, మనస్పర్థలు, ఇగో సమస్యల్లో సారూప్యత లుంటాయనీ, అందుకే 365డేస్ చిత్రానికి ‘ఇది అందరి పెళ్లికథ’ అనే క్యాప్షన్‌ను పెట్టానన్నారు. పెళ్ళయిన నాటి నుంచి ఒక జంటలో విభేదాలు రావడానికి కొంత సమయం తీసుకుంటుందనీ, ఆ సమయమే ఈ 365డేస్ అనీ, అందుకే  ఈ టైటిల్ తీసుకున్నట్టు చెప్పారు వర్మ. ఈ చిత్రాన్ని పూర్తిగా పెళ్లిపట్ల తనకున్న కోణం నుంచే రూపొందించానన్నారు. ఆయన దృష్టిలో ఇద్దరు కలిసి బతకడం వేరు. ఒకరు లేకుండా ఒకరు జీవించలేని స్థితి వేరంటున్నారు(ఇది నిజమే కానీ, అలాంటి జంటలు నూటికి ఒకటైనా ఉంటోందో లేదో మరి..). తన మిత్రుడొకడు ఏడేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట, పెళ్లయ్యాక ఏడురోజుల్లో విడిపోయారట. ఇక తన జీవితం గురించి చెపుతూ....తన భార్యతో విడిపోవడానికి పెద్దగా కారణాలు లేవనీ, తన జీవిత లక్ష్యాలు వేరు...  (టాలీవుడ్ బాలీవుడ్ లో గొప్ప గొప్ప సినిమాలు తీయాలని) ఆమెకున్న ప్రాధాన్యతలు వేరుగా ఉండేవన్నారు. అయితే అలా చేయడం తప్పని ఇప్పుడు వర్మకు అనిపిస్తోందట కూడా(!). వర్మ కూతురిపై చేసిన కామెంట్లు విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయేమో గానీ, ఎక్కడో ఆయనలో ఆనందం కూడా ఉందనిపిస్తోంది. యూత్ రక్తంలో ఉన్న వేడికీ వయసు పైపబడుతున్న అనుభవానికీ చాలా తేడా ఉన్నట్టు ఆయన మాట తీరు వేరైనా ఇన్నర్ గా ఏదో చెపుతున్నట్టనిపిస్తోంది. ఈ సినిమా తీయడంలోని ఉద్దేశం కూడా అదేనేమో... అంటే వర్మ నిజంగానే మారిపోయాడండోయ్....

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ