వరుణ్ సందేశ్ సినిమాల షూటింగ్ లు, ఆడియో ఫంక్షన్లు, రిలీజ్ లు అలా వచ్చి ఇలా వెళుతున్నాయి అన్నట్టు ఉన్నాయి తప్ప, సక్సెస్ సాధించిన సినిమాలు ఇటీవల లేవనే చెప్పాలి. శేఖర్ కమ్ముల హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం సినిమాలు తప్ప అంతటి సక్సెస్ ఇచ్చిన సినిమాలు వరుణ్ కు రాలేదు. సినిమాలు చేయడం మాత్రం ఆగలేదు. ఒకదాని తరువాత ఒకటిగా వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వరుణ్ చేస్తున్న మరో చిత్రం ‘లవ కుశ'. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. అయితే ఇందులో వరుణ్ సందేశ్ ద్విపాత్రాభినయం చేశాడట. జయశ్రీ శివన్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు పరిచయమయ్యాడు. హీరోగారి సరన రిచా పనై, రుచి త్రిపాటి అనే ఇరువురు భామలు నటించారు. ఈ చిత్రానికి సత్య మోహన్, ప్రకాష్ నిర్లుమాతలు కాగా సినిమా షూటింగ్ అంతా ఎక్కువగా మలేషియాలో చేశారట. చాన్నాళ్ళ తరువాత హాస్య నటుడు బాబు మోహన్ ఇందులో కనిపించబోతున్నారు. త్వరలో ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ చేసి, విడుదల చేయాలనుకుంటున్నారు. టీజర్ మాత్రం ఇద్దరు హీరోయిన్లతో హాట్ హాట్ గా సరదాగా కనిపిస్తోంది.