వరుణ్ కంచెకు ఇంత ఖర్చా?

September 04, 2015 | 05:04 PM | 3 Views
ప్రింట్ కామెంట్
kanche_budget_21_crores_niharonline

చాలా రోజుల క్రితం ఒక్క పోస్టర్ విడుదల చేసిన ‘కంచె’ సినిమా ట్రైలర్ విడుదల చేయడంతో ఈ సినిమాకు విపరీతమైన స్పందన వచ్చింది. హీరోలు వరుణ్ తేజ్ కు మొదటి సినిమా కన్నా ఈ సినిమాకు మంచి బ్రేక్ అవుతుందని అనుకుంటున్నారు. అయితే ఒక్క పోస్టర్ తప్ప ఎలాంటి వార్తలూ బయటికి పొక్కకుండా సీక్రెట్ గా జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ కు సంబం
ధించిన విశేషాలు ఒక్కటికొక్కటిగా ఇప్పుడే బయటికి వస్తున్నాయి. 1939-45 మధ్య జరిగిన రెండో ప్రపంచ యుద్దం బ్యాక్ డ్రాప్ కావడంతో అప్పటి కాలానికి అనుగుణంగా సెట్టింగులు, కాస్ట్యూమ్స్, ఆయుధాలు ఇలా అన్నంటి కోసం భారీగానే ఖర్చు పెట్టారట. తాజాగా ఓ ఇంగ్లిష్ లీడింగ్ డైలాతో దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ ఈ సినిమాకు ఎంత బడ్జెట్ ఖర్చయిందనే విషయాలు వెల్లడించారు. సినిమా మొత్తం 21 కోట్ల తో పూర్తవుతుందని చెప్పాడట క్రిష్. వరుణ్ తేజ్ లాంటి హీరోకు ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం ఎక్కువనే ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. కానీ ఈ కథే వెరైటీగా ఉండడంతో ప్రేక్షకుల్లోనూ మంచి ఆసక్తి పెరిగిపోతోంది. మెగా పామిలీ హీరో అనే కన్నా క్రిష్ ఎంచుకున్న కథే ఇక్కడ హైలైట్ అవుతుందనుకుంటున్నారు. జార్జియా దేశం లో, రియల్ వరల్డ్ వార్ 2 వెపన్స్ , యుద్ధ ట్యాంక్స్ , యూనిఫాం, లొకేషన్స్‌ను వాడుకుని, భారీ వ్యయం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. అక్టోబర్ 2న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ