గోపాల గోపాల తర్వాత విక్టరీ వెంకటేష్ ఇంతవరకు ఏ సినిమాకి ఓకే చెప్పలేదు. ఆ మధ్య ఓ రెండు మూడు రీమేక్ చిత్రాలలో నటిస్తాడనే వార్తలు వచ్చినప్పటికీ వాటిని వెంకీ ఖండించాడు. అంతేకాదు త్వరలోనే కొత్త సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని చెప్పాడు. రామానాయుడు పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రం ప్రారంభం అవుతుందని హింట్ కూడా ఇచ్చాడు. అయితే తాజా సమాచారం ప్రకారం వెంకీ ఒకటి కాదు ఏకంగా రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలో వెల్లడిస్తాడట. ఇందులో ఓ చిత్రం మల్టీస్టారర్ అయి ఉండవచ్చుననే ఊహగానాలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే వెంకీ ఫ్యాన్స్ కి పండగే కదా.