సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు లో దశాబ్దాల తర్వాత మల్టీస్టారర్ చిత్రాలకు తిరిగి ప్రాణం పోసింది. ఇక అప్పటి నుంచి ఈ తరహా చిత్రాలకు అగ్రహీరోల దగ్గరి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ ఈ తరహా చిత్రాలకు ముందుంటున్నాడు. హీరో ఎవరు? తన పాత్ర ఏంటనే అంశాలను పరిశీలించకుండానే చిత్రాలకు ఓకే చెప్పేస్తున్నాడు. ఇక తాజాగా మరో మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. గతేడాది సంక్రాంతికి తమిళంలో మోహన్ లాల్, విజయ్ హీరోగా విడుదలైన ‘జిల్లా’ చిత్రం పెద్ద కమర్షియల్ సక్సెస్ ను సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలుగులో చిరంజీవి, రామ్ చరణ్ లపై తీస్తారని అప్పట్లో గాసిప్స్ వినిపించాయి. అయితే అది కార్యరూపం దాల్చలేదు. ఇక గతంలో వెంకటేష్ , రవితేజ కలిసి ఓ చిత్రం చేయనున్నారనే వార్త వినిపించింది. అయితే లేటేస్ట్ అప్ డేట్ ప్రకారం వెంకటేష్, రవితేజలు కలిసి చేయబోయేది జిల్లా రీమేక్ లోనేనట. మాత్రుకలో మోహన్ లాల్ పాత్రలో వెంకటేష్, విజయ్ పాత్రలో రవితేజ నటించనున్నారని తెలుస్తోంది. బిందాస్ ఫేమ్ వీరుపోట్ల ఈ చిత్రాన్ని దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.