పూరీ జగన్నాథ్ తను చేసిన ‘టెంపర్’ మూవీని గురువుగారైన రామ్ గోపాల్ వర్మకు చూపించారట. దీంతో రాంగోపాల్ వర్మ ఇక ఆగలేక జూ.ఎన్టీఆర్ గురించి ఒకటే పొగడ్తలు అవి ఏ లెవల్ లో ఉన్నాయంటే, ఎప్పుడో 19 సంవత్సరాల క్రితం చనిపోయిన మహానటుడు నందమూరి తారకరామారావును టార్గెట్ చేస్తూ... సంచలనం రేపాడు. తను స్వయంగా సోషల్ మీడియా లో ఈ విషయాలను ప్రజలతో పంచుకున్నారు. ఐదు దశాబ్దాల పాటు టాలీవుడ్ ను ఏలిన నందమూరి తారకరామారావు అంటే తనకు ఎంతో గౌరవమని అయినా ఆయన మళ్ళీ పుడితే జూనియర్ వద్ద నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయని కామెంట్ చేడాడు. అంటే ‘టెంపర్’ సినిమా ఆయనను అంతలా ప్రభావితం చేసిందట. ఈ సినిమాలోని జూనియర్ చూపులకు ఆ సీనియర్ ఎన్టీఆర్ కూడా సరిపోడు అని అనిపిస్తోందని కామెంట్ చేశాడు. తాపే సినిమాలు థియేటర్లో చూడ్డం మర్చిపోయాననీ, టెంపర్ మాత్రం 13న బ్రమరాంబలో ప్రేక్షకులతో కలిసి చూస్తానని అంటున్నాడు. అంతేకాదు ఆరోజు ఆ థియేటర్ లో జూనియర్ అభిమానులు చేసే హంగామాను చూడటానికి నందమూరి తారకరామారావు ఆత్మ వచ్చి తన పక్కన కూర్చుంటే జూనియర్ నుంచి సీనియర్ నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని వివరిస్తానని చెపుతున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ కన్నా...జూనియర్ ముందు పుట్టి ఉంటే..ఆయన కన్నా పెద్ద స్టార్ అయ్యిండేవాడని కూడా అంటున్నాడు. ఈ కామెంట్లు చూసిన సీనియర్ అభిమానులు కొందరు ఆయనపై ధ్వజమెత్తారట. ఆ మహానటుడితో ఈ బుడ్డోడికి పోలిక ఏమిటని. ఈ కామెంట్లు చూసిన రామ్ గోపాల్ వర్మ నాకు జూ.ఎన్టీఆర్ నటన నచ్చి ఆపుకోలేక అలా కామెంట్ చేశానని వర్మ వివరణ కూడా ఇచ్చుకున్నాడట. చేతులు కాలాక ఆకులు పట్టుకునే చందం వర్మకు కొత్త కాదు కదా!