సీనియర్ నటి రాధ గుర్తింది కదా మీకు... ఎలా మర్చిపోగం.... తను అందరు సీనియర్ హీరోలతోనూ హీరోయిన్ గా చేసింది. శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో దాదాపు 100 సినిమాల్లో నటించింది. ముఖ్యంగా రాధ సినిమా అంటే గుర్తుకు వచ్చేది తమిళంలో శివాజీ గణేషన్ తో నటించిన ‘ముత్తల్ మరియత్తై’ సినిమా. ఇది తెలుగులోకి ‘ఆత్మ బంధువు’గా డబ్ చేశారు. ఇందులో ఆమె పాత్ర చాలా ఉదాత్తమైనది, ఎక్స్ లెంట్ యాక్షన్. ఇక తెలుగులో ఎక్కువ శాతం గ్లామర్ పాత్రలే చేసింది కొండవీటి దొంగ, దొంగ, జేబుదొంగ, గూండా అడవిదొంగ ఇలా చాలా దొంగ సినిమాల్లో చిరంజీవితో నటించింది. మరణ మృదంగం, రాక్షసుడు వంటి ఎన్నో సినిమాల్లో చిరంజీవికి జోడీగా నటించింది. కమల్ హాసన్ తో నటించిన టిక్ టిక్ టిక్ సినిమాలో చిన్న పాత్రే అయినా స్విమ్మింగ్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. రాధ అక్క అంబిక కూడా ఫేమస్ నటి. 1980లో సినిమా జీవితం మొదలు పెట్టిన రాధ 1991లో రాజశేఖరన్ నయ్యర్ అనే ఓ బిజినెస్ మేన్ ను పెళ్ళి చేసుకుని సినీ జీవితానికి ముగింపు పలికింది. సినిమాకు తను చేసిన సేవలకు గాను కలైమామణి బిరుదును అందుకుంది. ఇప్పుడు బిజినెస్ ఉమెన్ గా సక్సెస్ ఫుల్ జీవితాన్ని గడుపుతోంది. ముంబయి, కేరళ లలో చెయిన్ హోటల్స్ నడుపుతోంది లండన్ లో కూడా ఒక హోటల్ రాక్ అండ్ రోల్ కిచెన్ (ఆర్ ఆర్ కె) రెస్టారెంట్ కు ఓనర్.
ఇక తన కూతుర్లు కార్తీక నయర్ (జోష్-2009) 17 ఏళ్ళ వయసులో సినీ కెరీర్ ను ప్రారంభించింది. చిన్న కూతురు తులసి నయ్యర్ 14 ఏళ్ళ వసులో మణిరత్నం సినిమా కాదల్ లో నటించింది. తనకో కుమారుడు విగ్నేష్ నయ్యర్. ఈ రోజు రాధ పుట్టిన రోజు సందర్భంగా నీహార్ ఆన్ లైన్ ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తోంది.