అందమైన అమ్మాయి కనిపిస్తే అబ్బాయి చూపు పడడం పరిపాటే... ఇది కొత్త విషయమేమీ కాదు... కానీ అమ్మాయిల మనసులో ఉన్నది ఒకటి... బయటికి మాట్లాడేది మరొకటి... ‘అతనేంటి చొంగగారుస్తూ చూస్తాడు అమ్మాయిల్ని ఎప్పుడూ చూడనట్టు...’’ అంటూ కామెంట్ చేస్తూ లోలోపల ఆనందపడిపోతుంటారు. అందంగా తయారైన అమ్మాయిలు.... అటుగా పోతుంటే చూడలేని అబ్బాయిలను తప్పు పట్టాలి... అందం ఆస్వాదించలేని వేస్ట్ ఫెలో కూడా అనుకోవచ్చునేమో... ఈ విషయం ఇప్పటి అమ్మాయిలు ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. విద్యా బాలన్ కూడా అదే అంటోందండీ... చూస్తున్న మగాళ్ళమీద చిరు కోపం ప్రదర్శించడం... ఉత్తిగానే అంటోంది... లోలోపల ఆనంద పడిపోతారట. ఏ అమ్మాయి అయినా ‘మేల్ అటెన్షన్’ కోరుకుంటుంది. తాను కూడా పురుషుల దృష్టి తన మీద పడ్డప్పుడు తెగ ఆనందపడిపోతానని చెబుతోంది. ఇంకా -‘‘మగాళ్ల దృష్టి తన మీద పడాలని ఏ స్త్రీ అయినా కోరుకుంటుందని నా ఫీలింగ్. ఒకవేళ నా అభిప్రాయంతో ఏకీభవించకపోతే నో ప్రాబ్లమ్. ఎవరి అభిప్రాయం వాళ్లది. నా మటుకు నేను ‘మేల్ అటెన్షన్’ని కోరుకుంటా. ‘ఛీ పాడు.. అలా చూస్తున్నాడేంటి’ లాంటి కామెంట్లు చేయను. ఎందుకంటే, మగవాడి కన్ను పడకపోతే నా అందం మీద నాకు డౌట్ వచ్చేస్తుంది. ఏంటీ మరీ ఇంత ఓపెన్‌గా చెబుతోందనుకోకండి. నేనిక్కడ మాట్లాడుతున్నది కేవలం చూపుల గురించి మాత్రమే. శృంగారం గురించి కాదు. మగవాళ్ల ఓర చూపులు భలే ఉంటాయి. నన్నెవరైనా ఆ టైప్‌లో చూస్తుంటే, నాకు భలే ఆనందంగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఆరోగ్యానికి మంచిదే‘‘ అంటోంది. కానీ, చూపులతో ఆగకుండా మరేదో కోరుకుంటే మాత్రం విద్యతో పాటు చాలా మంది అమ్మాయిలు ఏకీభవించరు మరి.... ఓన్లీ చూపుల అటెన్షన్ కోరుకునే వారు, తమ అందం గురించి తాము చాలా సంబరపడిపోవడానికి మాత్రమే అనేది ఎక్కువ శాతం అమ్మాయి అంగీకరిస్తారు.