ఉమ్మేస్తే ఊరుకోనంటున్న డర్టీగర్ల్

January 22, 2015 | 05:34 PM | 47 Views
ప్రింట్ కామెంట్

ఈ మధ్య టీవీల్లో ఆ పనికి ఆరుబయటికి వెళ్ళకూడదని ఓ అవేర్ నెస్ యాడ్ లో ఊదర గొడుతున్న విద్యాబాలన్, డబ్బు తీసుకోకుండా కూడా అవేర్ నెస్ కోసం ప్రయత్నిస్తోంది. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మేస్తే వారి మొహం మీదే తిరిగి ‘ఛీ' కొడతానని, గత కొన్నేళ్లుగా తనకు ఇది అలవాటయిందని అంటోంది. ఉమ్మేసే ఎంతటి వారయినా సరే వదిలిపెట్టదట. నిజమే మన భారత దేశంలో ఉన్న చాలా చెడ్డ అలవాటిది. అదే విదేశాల్లో అయితే జరిమానా విధించే వారు. తాను ‘ఛీ' అనడం వల్ల వారు బాధ పడ్డా సరే ఈ విధంగానైనా వారు మారతారని విద్యా బాలన్ భావిస్తోంది. తన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా లేకుంటే అస్సలు ఊరుకోను అని అంటోంది విద్యా. తన ఇంటి చుట్టు పక్కల ఎవరైన చెత్త పడేస్తే చేతికి గ్లౌజులు వేసుకుని ఆ చెత్తను తీసి డస్ట్ బిన్ లో పడేస్తాను అని విద్యా బాలన్ చెప్పుకొచ్చారు. ఎవరైనా సిగరెట్ పీకలు, చాకొలెట్ వేపర్స్ చెత్త బుట్టలో కాకుండా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే ఏ మాత్రం ఊరుకోదట. ఇలా సోషల్ నెట్ వర్కుల్లో అందరితో తన అభిప్రాయాలు పంచుకుంటోంది విద్యాబాలన్. ఆమె 2012 లోనే సానిటేషన్ నేషల్ అంబాసిడర్‌ అయిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి విద్యా బాలన్ ఇలాంటి విషయాలపై మరింత ఎక్కువ శ్రద్ధ పెడుతోంది. కేవలం డబ్బిస్తే స్క్రీన్ మీద ఏదో చేసేద్దాం అనుకునే వారు విద్యబాలన్ ను స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే మరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ