కమల్ ఇంటికెళ్ళిన విద్యాబాలన్?

March 30, 2015 | 05:31 PM | 73 Views
ప్రింట్ కామెంట్
vidya_balan_want_to_act_tamil_movie_niharonline

విద్యాబాలన్ అభిమానులు భారత దేశం మొత్తంలో ఎంతో మంది ఉంటారు. మరి ఈమెకూ అభిమాన నటుడు ఉండే ఉంటాడుగా... ఆయనెవరో కాదు కమల్ హాసనట. ఈమె చెన్నై వాస్తవ్యురాలే అయినప్పటికీ ఛాన్సులు మాత్రం బాలీవుడ్ లో వచ్చాయి. ఫేమస్ స్టార్ అయిపోయింది. తన అభిమాని గురించి తన అభిమానులతో చర్చించిన వేళా విశేషం ఏమిటంటే.... విద్యాబాలన్ చెన్నైలో జరిగిన జేడబ్ల్యూఎఫ్ సదస్సుకి హాజరైన సందర్భంలో అక్కడ అభిమానులతో అనేక విషయాల్ని పంచుకుందట. తాను చిన్నప్పటినుంచి కమల్ హాసన్‌కి బిగ్ ఫ్యాన్‌ని అని గుర్తుచేసుకుంటూ, ఆయన్ను కలవడానికి అప్పట్లోనే చాలా ప్రయత్నించానని చెప్పింది. ‘‘మా బంధువుల ఇంటికి దగ్గరలోనే కమల్ ఇల్లు వుండేది. ఎలాగైనా సరే ఆయన్ను కలవాలనే ఉద్దేశంతో ఓరోజు తనని అక్కడికి తీసుకెళ్లమని పట్టుబడితే, మా వాళ్లు కమల్ ఇంటికి తీసుకెళ్లారు. కానీ ఆయన్ను కలవడం అనుకున్నంత సులువు కాదని అక్కడికెళ్లాకే అర్థమైంది. మేం వెళ్లిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. అయితే, తాను కమల్‌కు అభిమానిని అని, ఆయన్ను కలిసేందుకు చాలాదూరం నుంచి వచ్చానని చెప్పాను. అది విన్నాకా.. వాళ్లు నాకు కమల్ ఆటోగ్రాఫ్ చేసిన ఓ ఫోటో ఇచ్చారు.  కమలో ఆటోగ్రాఫ్‌తో పాటు ఆయన ఫోటో కూడా నా చేతికి చిక్కడంతో ఆరోజు తాను ఎంతో థ్రిల్‌గా ఫీలయ్యా’’నని చెప్పింది.  తనకు ఎంతో కాలంగా తమిళంలో నటించాలని వుందనీ, తనకు బాలీవుడ్‌లో 'పరిణీత' సినిమా ఛాన్స్ రాకముందే తమిళ సినిమాలో ఓ అవకాశం వచ్చినట్లే వచ్చి జారిపోయిందట.

ఇప్పుడు విదాయ బాలన్ కోరిక తెలిశాకా.. ఎవరైనా ఓ తమిళ సినిమా ఆఫర్ ఇవ్వక పోతారా అమెకు. ఆ ఛాన్స్ కూడా కమల్ హాసన్ సరసన వస్తే తన చిరకాల కోరిక తీరినట్టే కదా.... కమల్ హాసన్-విద్యాబాలన్ జంటగా ఓ సినిమా రావాలని మనమూ కోరుకుందాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ