పేరున్న ప్రముఖుల కథలను మార్చుకుని సినిమాలు తీయడం సినిమా ఇండస్ట్రీలో పరిపాటి. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, భక్త రామదాసు లాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి... కానీ ఇటీవల కాలంలో సినిమా వాళ్ళ పేర్లతో సినిమాలు తీయాలనే ఆలోచన రావడం... ఇందులో వారికి సంబంధించిన కథ ఏమీ ఉండకపోయినా, కేవలం వారి పేర్లతోనే పబ్లిసిటీ ఇచ్చుకోవాలనుకుంటారు... అలా రాంగోపల్ వర్మ ‘శ్రీదేవి’ అనే సినిమా తీయాలనుకున్నారు. అది శ్రీదేవి దాకా వెళ్ళి ఆమె రాంగోపాల్ వర్మ మీద సీరియస్ అయిపోయి సినిమాకు తన పేరు పెట్టుకోవద్దని చెప్పేసింది. అలాగే మై హూ రజనీకాంత్ అనే పేరు తో ఓ సినిమా తీయాలనుకున్నారు. దీనికి రజనీ కాంత్ కూడా అడ్డు చెప్పారంట. ఆ సినిమా పవర్ ఫుల్ గా తీస్తే ఓకే కానీ, తమ ఇమేజ్ కు డామేజ్ కలిగేలా ఏ మాత్రం సినిమాలో తక్కువైనా తమ పేరు చెడగొట్టినట్టవుతుందని వారి ఉద్దేశం. అయితే ఇటీవల విద్యాబాలన్ పేరుతో ఓ సినిమా తీస్తున్నారట. ఆ విషయం విద్యా బాలన్ కు తెలిసి, అవునా? నిజమా నా పేరును సినిమాకు వాడుకుంటున్నారా? అని తెగ సంతోషపడిపోయిందట. ఈ సినిమా టైటిల్ వేరీజ్ విద్యాబాలన్? అట. మరి టైటిల్ విషయంలో తనకెలాంటి భయాలూ లేవేమో విద్యాబాలన్ కు?