ప్రస్తుత పరిస్థితిలో ఓ కొత్త రాజకీయ పార్టీ పెట్టడమంటే ఆత్మహత్య చేసుకోవడమేనని తమిళ సూపర్ హీరో విజయ్ కి ఆయన తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ హితబోధ చేస్తున్నాడట. తమిళనాట విజయ్ కి 10 లక్షల మందికి పైగా అభిమానులు, 350కి పైగా అభిమాన సంఘాలు ఉన్నాయి. అభిమానులు అంతా తమ హీరో రాజకీయ రంగ ప్రవేశం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి సూచనలకు తలొగ్గి మక్కల్ ఇయక్కం పేరుతో ఒక సంఘాన్ని విజయ్ నెలకొల్పారు. రాజకీయల్లోకి రావడానికే ఈ సంఘాన్ని ప్రారంభించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ లేఖ రాయగా, ఆయన బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు బయలుదేరాయి. నూతన సంవత్సరం సందర్భంగా జనవరిలో సొంతంగా పార్టీని ఏర్పాటు చేసి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనతో విజయ్ తన తండ్రి ఎస్‌ఎ చంద్రశేఖర్‌తో సంప్రదించగా, అందుకాయన నిరాకరించారని తెలుస్తోంది. 50 ఏళ్ళు దాటిన తరువాత రాజకీయ రంగ ప్రవేశం గురించి ఆలోచించు. అప్పటి వరకు సినిమాలు కొనసాగించు అని సలహా ఇచ్చినట్టు సమాచారం.