విజయనిర్మల... సూపర్ స్టార్ కృష్ణ భార్యగా కంటే ఎక్కువ చిత్రాలకు దర్శకురాలిగా వ్యవహరించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కి ఆమె సొంతగా ఒక పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాంటి ఆమె ఇటీవల జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో కంటతడి పెట్టారు. అయితే అవి ఆనందంతోకాదండీ. తెలంగాణ స్త్రీ శక్తి సమితి వారు ఇటీవల ఆమెకు అవార్డు బహుకరించదలిచి రవీంద్ర భారతిలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారట. దీనికి తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హజరుకావాల్సి ఉంది. అయితే రావాల్సిన అతిథులు రాకపోవటంతోపాటు కార్యక్రమానికి పట్టుమని పదిమంది కూడా రాలేదట. దీంతో ఆమె తీవ్ర విచారం వ్యక్తంచేస్తూ కంటతడి పెట్టారట. తెలంగాణ ప్రభుత్వం నుంచి తనకిది రెండో అవార్డని, ఇలాంటి కార్యక్రమానికి స్పందన లేకపోవడం దురద్రుష్టకరమని ఆమె వాపోయారట. కనీసం మీరైనా వచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపి అవార్డు సైతం స్వీకరించకుండా వెళ్లిపోయిందట. దీంతో అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారంట. ఎంతైనా ఓ స్టార్ మహిళా దర్శకురాలిని ఇలా అవమానించాల్సింది కాదు కదా.