నాలుగో సింహానికి బ్రాండ్ అంబాసిడర్

June 20, 2015 | 03:15 PM | 1 Views
ప్రింట్ కామెంట్
saikumar_brand_ambassador_vijayawada_niharonline

పలు సినిమాల్లో యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ గా నటించిన సాయి కుమార్ ఇప్పుడు పోలీస్ అంబాసిడర్  అయ్యాడు. విజయవాడ సిటీ పోలీసు శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు సాయి కుమార్ నియమితులయ్యారు. సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు అంగీకరించినందుకుగాను నగర పోలీస్ కమీషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ పోలీసులు ‘నాలుగో సింహం' పేరుతో ఓ యాప్ రూపొందించారు. జూన్ 21న సాయి కుమార్ చేతుల మీదుగా ఈ యాప్ విడుదల చేయనున్నారు. విజయవాడ కమీషనరేట్ పరిధిలో పోలీసులు పలు ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటికి సాయి కుమార్ ప్రచార కర్తగా ఉండబోతున్నారు. తెలుగులో సాయికుమార్ నటించిన ‘పోలీస్ స్టోరీ' చిత్రం పెద్ద హిట్టయింది. పోలీస్ అంటే ఇలానే ఉండాలి అనే రీతిలో ఈ చిత్రం ప్రేక్షకుల గుండెల్లో పాతుకు పోయింది. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే...కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అంటూ సాయి కుమార్ చెప్పిన డైలాగ్ ఎవరూ మరిచిపోలేనంతగా పాపులర్ అయింది.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ