‘ఐ’ చిత్రం కోసం దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న చియాన్ విక్రమ్ ఐ తర్వాత స్పీడ్ పెంచి వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్నత్తుకుల్లె’ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ముగిసిని వెంటనే ఆనంద్ రాజ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, ప్రియాఆనంద్ హీరోయిన్స్. ఈ సినిమా జూన్ మలేషియాలో చిత్రీకరణ జరుపుకుంటుందట. అక్కడ ఓ లాంగ్ షెడ్యూల్ ప్లానింగ్ లో ఉంది.