చియాన్ విక్రమ్ ప్రస్తుతం విజయ్ మిల్టన్ దర్శకత్వంలో ‘పత్తు ఎన్రత్తు కుల్ల’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత ‘అరిమనంబి’(తెలుగులో డైనమైట్) ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి ‘మర్మ మణిదన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, ప్రియాఆనంద్ లు హీరోయిన్స్ గా నటించనున్నారు. సినిమా ఏప్రిల్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.