మిల్టన్ కథను క్షణాల్లో ఓకే చేసిన విక్రమ్

January 08, 2015 | 05:17 PM | 30 Views
ప్రింట్ కామెంట్

హీరో ఒక కథ వినిపించడమంటే కొన్ని గంటలు టైమ్ తీసుకుంటారు. వినిపించడంలో అర్థమయ్యేలా, హత్తుకునేలా చెప్పలేకపోవచ్చు. మరోసారి కథ మార్చి తెమ్మని కూడా అడగవచ్చు కానీ ఇవేమీ లేకుండా పది క్షణాల్లో కథను ఒకే చేశారట సౌత్ ఇండియన్ స్టార్ హీరో విక్రమ్. ఒక సినిమా ఫ్లాప్ అయ్యిందంటే ఆ హీరో కెరీర్ మీద చాలా ప్రభావం కనిపిస్తుంది. సినిమా నిర్మాణంలో కీలకమైనది కథ. ఇది ఒకే అవ్వడమే చాలా చాలా కష్టం. అయితే తన కథని పది క్షణాల్లో హీరో విక్రమ్ ఓకే చేసారని గర్వంగా చెప్తున్నారు విజయ్ మిల్టన్. సినిమాటోగ్రాఫర్‌గా పలు చిత్రాలకు పనిచేసిన విజయ్‌మిల్టన్‌ 'గోలిసోడా'తో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నారు. చాలా తక్కువ బడ్జెట్‌లో చెన్నైలో సినిమాను తెరకెక్కించి.. భారీఎత్తున కలెక్షన్లు రాబట్టారు. ఏమాత్రం పెద్ద తారాగణం లేకుండా చిన్న పిల్లలతో సినిమాను తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు. ఆ వూపుతో ఉన్న విజయ్‌మిల్టన్‌ ఇటీవల ఓ కథను విక్రంకు చెప్పి వినిపించారు. కథ చెప్పిన పది క్షణాల్లోనే విక్రం ఓకే చెప్పారట. ఆ కథే ఇప్పుడు '10 ఎండ్రత్తుకుల్ల'గా తెరకెక్కుతోంది. ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు విక్రంతో పరిచయం గురించి చెప్తూ... 'గోలిసోడా' చిత్రాన్ని సత్యం థియేటర్‌లో చూసి.. వెంటనే నాకు ఫోన్‌ చేశారు విక్రం. చాలా బాగుందని మెచ్చుకున్నారు. మరి నాకు ఏదైనా మంచి కథ ఉందా?.. అని ఆ రోజు అడిగారు. నేనస్సలు నమ్మలేకపోయా. తప్పకుండా కథతో మీ వద్దకు వస్తానని చెప్పాను. నా కథ విని ఆయన సినిమాకు ఓకే చెప్పడం చాలా ఆనందంగా ఉందని ట్విట్టర్చె లో చెప్పుకున్నారు మిల్టన్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ