రౌడీ ఫెలో సినిమాతో తెలుగులోకి ఎంటరైన నటి, పలు హిందీ, తమిళం చిత్రాల్లో నటించిన హీరోయిన్ విశాఖ సింగ్ ఫేస్బుక్లో కొందరి నుండి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. ఆమె పోస్టు చేసిన ఫోటోపై కొందరు బూతు కామంట్లు చేశారు. అయితే ఆమె తిరిగి వారిపై ఎదురు దాడి చేసింది. "'Everybody is somebody's foreigner' అనే క్యాప్సన్ ఉన్న ఫోటోను విశాఖ సింగ్ ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. ఈ ఫొటోనుద్దేశించి.....ఆమె వక్షోజాల గురించి అసహ్యమైన కామెంట్లు చేసారు. విశాఖ సింగ్ వెంటనే వారికి ఘాటుగా సమాధానం ఇచ్చింది. నీ తల్లికి, చెల్లికి, భార్యకి, బామ్మకి, స్నేహితులకూ కూడా వక్షోజాలు ఉంటాయి. మహిళలను గౌరవించడం నేర్చుకో... నా పేజీ నుండి గెట్ ఔట్ అంది. ఈ కామెంట్ల పరంపర తీవ్రం కావడంతో తన పోస్టింగును ఫేస్ బుక్ నుండి తొలగించింది. వివాదానికి తెరదించడానికే తాను ఆ పోస్టును తొలగించినట్లు విశాఖ సింగ్ తన ఫేస్ బుక్ టైమ్ లైన్ మీద రాసుకుంది.