మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉంటున్న విశాల్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని చాలా మంది, చాలా సార్లు వేసిన ప్రశ్న.. అయితే ఈ ప్రశ్నకు సమాధానాన్ని విశాల్ కన్ ఫర్మ్ చేసేశాడు. వచ్చేనెలో తమిళనాట జరగనున్న నడిగర్ సంఘం ఎన్నికలకు సంబంధించిన మీటింగ్ లో పాల్గొన్న విశాల్ తను ఎప్పుడూ ఎన్నికల్లో నిలబడాలనుకోలేదని, అయితే తాను నిలబడితే 2500 కుటుంబాలకు మేలు జరుగుతుందని తెలియడంతో పోటీచేస్తున్నానని, నడిగర్ సంఘం కోసం భవనం కట్టడమే ప్రస్తుతం తన ముందున్న లక్ష్యమని ఒకప్పుడు ఎమ్టీఆర్, శివాజీ గణేషన్ వంటి సీనియర్ నటుటు చాలా కష్టపడి కళ్యాణ మంటపం కడితే దాన్ని కూల్చేశారని పట్టించుకోవడం లేదని తాను తిరిగి ఆ ప్రేదశంలో కళ్యాణ మంటపం కడుతానని, అలా కట్టినరోజే తను పెళ్లి చేసుకుంటానని తేల్చిపారేశాడు. అదీ సంగతి...