విశాల్-వరలక్ష్మిల ప్రేమ ఫలించేనా?

December 30, 2014 | 06:22 PM | 22 Views
ప్రింట్ కామెంట్

ఇది ఏ సినిమా కథో అనుకుంటున్నారేమో, కాదు సుమా... రియల్ స్టోరీ అని కోలీవుడ్‌ కోడై కూస్తోంది. అక్కడ ఇప్పుడు హీరో విశాల్-సీనియర్ నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి లవ్ మ్యాటరే హాట్ టాపిక్. అయితే గతంలోనే వీరిద్దరి ప్రేమ గురించి అడిగిన వారిని ఖండిస్తూ వచ్చారు. వీరిద్దరూ ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే శరత్ కుమార్ కు ఈ వ్యవహారం నచ్చడం లేదని అంటున్నారు. విశాల్ కు శరత్ కుమార్ కు పడడం లేదని కూడా అనుకుంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో విశాల్ ను వరలక్ష్మిని మీరు పెళ్లి చేసుకుంటారా అని అడిగితే ఆమె విలువైన నిధి లాంటిది అని సమాధానం ఇచ్చాడట. మరీ అంతగా ఆమెపై ప్రశంసలు కురిపించేయడానికి కారణం ఆమెపై ఉన్న అపారమైన ప్రేమే అని కోలీవుడ్‌లో గుసగసలు వినిపిస్తున్నాయి. తండ్రి ఒప్పుకోక పోయినా వరలక్ష్మి మాత్రం విశాల్‌ను పెళ్లి చేసుకోవాలని డిసైడైపోయిందట. మరి వీరి ప్రేమ ఫలిస్తుందా శరత్ కుమార్ వీరిద్దరిపై అక్షింతలు వేస్తాడా? వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ