చిన్న ఛాన్స్ ఇస్తానంటున్న విష్ణు

January 16, 2015 | 03:30 PM | 21 Views
ప్రింట్ కామెంట్

మంచు విష్ణు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ను ప్రారంభించాడు. హీరోగానే కాకుండా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీతో నిర్మాతగా మారిన మంచు విష్ణు ప్రతి ఏటా పొట్టి సినిమాల కాంటెస్ట్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వారం రోజుల పాటు జరిగే ఈ కాంటెస్ట్ లో సినీ పరిశ్రమలో కొత్తగా అడుగు పెట్టాలనుకునే వారికి మంచి అవకాశం అంటున్నాడు. అంతే కాదు ఈ కాంటెస్ట్ లో విజేతలయిన వారికి వారి సొంత వారి సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ లో ఒక ఫీచర్ కు దర్శకత్వం వహించే అవకాశం ఇస్తానంటున్నాడు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకునే వారికి ఇది సువర్ణావకాశమే మరి. అయితే, ఛాన్స్ కొట్టేస్తే సరిపోదు మరి ఎప్పుడూ క్రికేటివ్ గా ఆలోచిస్తూ తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. నిత్యం కొత్త కోణంలో సినిమాలు చేయాలంటున్నాడు విష్ణు. షార్ట్ ఫిల్మ్ తీసిన వారిని ప్రతి ఏడాది మోహన్ బాబు పుట్టినరోజయిన మార్చి 19న విజేతలుగా ప్రకటించి వారికి తగిన ప్రోత్సాహం అందిస్తారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ