బాహుబలి విడుదలకు ముందు నుంచే ఎన్నో సినిమాలపై ప్రభావం చూపింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తమ చిత్రాలకు రిస్క్ అని తెలిసి కూడా చాలా మంది నిర్మాతలు వాటిని పోస్ట్ పోన్ చేసుకున్నారు. చివరికి మొదటి నుంచి అదే తేదీకి రావాలనుకున్న మహేష్ బాబు సైతం ‘శ్రీమంతుడు’ను వాయిదా వేసుకున్నాడు. ఐతే విడుదల దగ్గర పడుతున్న కొద్ది బాహుబలి ప్రభంజనాన్ని తట్టుకోలేని కొన్ని చిత్రాలైతే అయోమయంలో పడి ఎప్పుడు విడుదల చేసుకోవాలో అర్థంకాకుండా పోయాయి. అందులో మొదటిది అల్లరి నరేష్ జేమ్స్ బాండ్. బాహుబలి విడుదల తేదీ ఫిక్సయ్యాక కూడా వారానికే అంటే 17 న విడుదల చేద్దామని అనుకున్నారు. అయితే దాని జోరు ముందు భయపడి 24 కు వాయిదా వేసుకున్నాడు. ఇక ఇలా డైలమాలో ఉన్న మరో మూవీ డైనమెట్. సేమ్ జేమ్స్ బాండ్ లాగానే 24 న విడుదల చెద్దామనుకున్నప్పటికీ బాహుబలి హవా ఈ వారం కూడా సాగుతుందన్న అనుమానం ఓ పక్క, మరోపక్క అల్లరోడికి పోటీ ఇవ్వడం ఎందుకనుకున్నాడో 31 కి వాయిదా వేసుకున్నాడు. అయితే ఆగష్టు 7న శ్రీమంతుడు రావటం పక్కా. దీంతో విష్ణు ఒక్క వారమే టైం ఉంటుంది. అంటే విష్ణు ఏం చేసినా ఈ వారం రోజుల్లోనే అన్నమాట. ఒకవేళ తర్వాత రిలీజ్ చేద్ధామనకున్నప్పటికీ కాసుకుని ఉన్న రుద్రమదేవీ, కిక్ 2 లు పోటీకి తప్పకుండా వస్తాయి. కాబట్టి ఏ బాధ లేకుండా ఒక్క వారంతోనే సరిపెట్టుకుందామని విష్ణు నిర్ణయించుకున్నాడన్న మాట. చూస్తుంటే విష్ణు పెద్ద రిస్కే చేస్తున్నట్లు ఉన్నాడు. చూద్ధాం... ఏమౌద్దో.