హాలీవుడ్ కి తీసిపోని రేంజ్ లో గ్రాఫిక్స్ తో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది బాహుబలి. ఎంతలా అంతే టోరంటో, కెనడా, తాజాగా ఫ్రెంచి ఫిల్మిం ఫెస్టివల్ లో స్టాండింగ్ ఓవెషన్ పొందే అంతగా. అయితే గ్రాఫిక్స్ అయినప్పటికీ యుద్ధ విన్యాసల్లో మాత్రం చాలా మట్టుకు రియాల్టి ఉండేలా చూసుకున్నాడు జక్కన్న. దాదాపు 2 వేల మంది జనం, ఏనుగులు, గుర్రాలు ఇలా కాస్త భారీగానే ఉపయోగించాడు. దీంతో అసాధారణ పోరాట విన్యాసాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూసిన అనుభూతి పొందారు ఆడియన్స్.
ఇక ఇప్పుడు రెండో పాయింట్ కంచె చిత్రం. క్రిష్ దర్శకత్వంలో రెండో ప్రపంచం యుద్ధం ఆధారంగా తెరకెక్కిన చిత్రం. ఓ ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే లేఖల సారాంశంగా ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. మరి దీనికి బాహుబలికి సంబంధం ఏంటంటారా?
అక్కడికే వస్తున్నాం. కంచెలో రెండో ప్రపంచ యుద్ధం సన్నివేశాలను భారీగానే చూపించాడట క్రిష్. యుద్ధంలో చాలా భాగం వైజాగ్ పరిసరాల్లోనే చిత్రీకరించటం విశేషం. రెండో ప్రపంచయుద్ధంలో ఉపయోగించిన 4 యుద్ధ ట్యాంకర్లు, 700 రియల్ గన్ లు, ఒక మెషీన్ గన్ ఉపయోగించారు. విశేషమేంటంటే ఈ తుపాకుల్నీ వాడటం ఎలాగో వరుణ్ కి నేర్పింది నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ అట. 700 మంది పైగా జూనియర్ ఆర్టిస్టులు యుద్ధ సైనికుల్లా పనిచేశారు. 700 పైగా డమ్మీ బుల్లెట్స్ ని యుద్ధ సన్నివేశాల్లో ఉపయోగించారు. అక్కడ బల్లెలు, కత్తులు, ఈటెలు, ఇక్కడేమో తుపాకులు, ట్యాంకర్లు, సైనికులు మొత్తానికి రియాల్టి కోసం దర్శకులు నిర్మాతలతో బాగానే డేర్ చేయిస్తున్నారు. కాకపోతే బాహుబలిలో గ్రాఫిక్స్ అయితే కంచెలో రియాల్టి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.