బాలీవుడ్ సెలెబ్రిటీలకు బంధాలు విడిచిపెట్టడమూ, కొత్త బంధాలను ఏర్పరచుకోవడమూ చాలా తేలికన్నట్టు ప్రవర్తిస్తుంటారు. ఒక బంధం బెడికొట్టినప్పుడు వారి గురించి మాట్లాడ్డానికి ఎంత మాత్రమూ ఇష్టపడరు సహజంగా. కానీ, ఇప్పుడు అది కూడా చాలా కామన్ అన్నట్టు గతం తాలూకు కబుర్లు కూడా చెప్పడం చాలా చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. దీపిక పడకునే తన మాజీ ప్రియుడు రణ్ బీర్ కపూర్ ను విడిచి కొత్త బంధాన్ని రణ్ వీర్ సింగ్ తో ఏర్పరుచుకుంది. అప్పట్లో రణ్ బీర్ కపూర్ తో జోరుగా ప్రేమాయణాన్ని సాగించినప్పటికీ కొన్నాళ్ళ తర్వాత ఎందుకో ఆ బంధాన్ని కాలదన్నుకుంది. ఇప్పుడు రణ్ వీర్ సింగ్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో పాటు ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా నడిపిస్తున్న ఈ భామ తాజా ప్రియుణ్ణి పక్కన పెట్టుకొని మాజీ ప్రియుణ్ణి గురించి అతడితో చేసిన రొమాన్స్ గురించి బాహాటంగా చెప్పుకోవడం... ఎందుకోసం? అంత అవసరమేంటి? ‘రణ్ బీర్ కపూర్ తో నాది ప్రత్యేకమైన అనుబంధం ,మా ఇద్దరి మద్య ఇంకా ప్రేమ ఉందో లేక అంతకు మించిన బంధం ఇంకేమైనా ఉందో కానీ నా మనసులో రణ్ బీర్ కు ప్రత్యేక స్థానముంది’ అంటూ మీడియాకి చెపుతోంది. మరి ఇప్పుడు దీపిక ఫామిలీతో కూడా కలివిడిగా తిరుగుతూ రేపో మాపో పెళ్ళి చేసుకోబోతున్నారంటూ వార్తల్లోకి ఎక్కుతున్న ఈ కొత్త ప్రియుడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయన్నది దీపిక పట్టించుకోదా? ప్రత్యేకమైన అనుబంధం మాజీ ప్రియుడితో ఉంటే ఉండింది గాక... మీడియాకు చెప్పుకోవడం వల్ల తనకు ఒరిగేది ఏమిటట...