టాలీవుడ్ బెస్ట్ రైటర్ గోపి మోహన్ రాంచరణ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రాంచరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో చిత్రం రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి గోపి మోహన్, కోన వెంకట్ లు సంయుక్తంగా కథను అందించారు. విడిపోయిన రైటర్లూ, డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ సినిమాతో మళ్ళీ కలిశారు. కాదు... కలిపారు. అయితే ఈ సినిమా రషెస్ ఇటీవల చూసిన గోపీ మోహన్ చాలా థ్రిల్ అయిపోయి, ఈ సినిమాకు రైటర్ గా పనిచేయడం చాలా సంతోషంగా వుందని, శ్రీనువైట్ల ప్రతి సీన్ ను ది బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అలాగే ఇందులో చరణ్ చాలా చాలా స్టైలిష్ గా, సూపర్బ్ గా వున్నాడని, అతని స్టైల్, డాన్సుల్లో ఎనర్జీ చూసి అతనితో లవ్ లో పడిపోయానంటూ చెప్పుకొచ్చాడు.
అంతే కాకుండా ఈ సినిమాకు హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ తన ఫ్రెష్ నెస్ ను జతచేసిందని, మనోజ్ పరమహంస కెమెరా వర్క్ బాగుందంటూ గోపి మోహన్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.